calender_icon.png 15 March, 2025 | 1:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమసమాజానికి సంకల్పబలం

18-02-2025 12:00:00 AM

మంచిని ఆశించడం, మంచితనం తో జీవించడం మానవ మనుగడను పదికాలాల పాటు పదిలంగా కాపాడగలదు. అ జ్ఞానాంధకారంలో జీవిస్తే జీవితానికి సార్థకత చేకూరదు. విద్య, వినయం, సంస్కారం వ్యక్తిత్వాన్ని పెంచుతుంది. నిజమైన విద్య వలన సకల సద్గుణాలు ప్రాప్తి స్తాయి. అజ్ఞానం అంధకారం లాంటిది. అలాంటి అంధకారాన్ని జ్ఞానమనే దీపం తో చెదరగొట్టాలి.

సాంకేతిక విజ్ఞాన ఫలితాల వల్ల విశాలమైన ప్రపంచం నేడు అతి చిన్నదైపోయింది. అత్యంత ఆధునాతన పరికరాలు మానవాళికి అందుబాటులోకి వచ్చాయి. ప్రపంచంలో ఏ చిన్న సంఘటన జరిగినా వాటివివరాలు దృశ్య, శ్రవ ణ సమాచార మాధ్యమాల ద్వారా క్షణా ల్లో మనకు అవగతమౌతున్నాయి. మనుషుల మధ్య సమాచార,సాంకేతిక పరిజ్ఞా నం ప్రధాన పాత్ర వహిస్తున్నది.

మనిషి ఎంత ఎత్తుకు ఎదిగినా, మనసులు మా త్రం అతి చిన్నవై పోయాయి. స్వార్థం పరాకాష్ఠకు చేరింది.  ఒకప్పటి సమిష్టితత్వం మటుమాయమైపోయింది. సంబంధాలు దూరమై పోయాయి. వ్యక్తుల మధ్య  కేవ లం ఆర్థికపరమైన, కృత్రిమ సంబంధాలే కొనసాగుతున్నాయి. మానవ సంబంధాలకు తావు లేకుండా పోయింది. దీనికి గల కారణం ఏమిటో ఒక సారి అన్వేషించుకోవాలి.

మూల కారణాన్ని విడిచిపెట్టి,  ప్రజ ల్లో చైతన్యం రావాలని కోరుకోవడం వి డ్డూరం. ‘మొక్కై వంగనిది మానై వంగు నా’ అనే నీతి వాక్యం ముమ్మాటికీ సత్యం. బాల్యంలో లేని క్రమశిక్షణ, యుక్తవయస్సులో లేని విచక్షణ అర్ధాంతరంగా అలవ డుతుందా? అందుచేత బాల్య దశలోనే క్రమశిక్షణ, విలువల ప్రాధాన్యత, మానవ సంబంధాల వంటి అంశాలపై బలమైన పునాది పడాలి.

అయితే నేటి విద్యావ్యవస్థ పలు అవస్థల్లో కూరుకుపోయింది.  పుస్తకాల బరువులతో కొందరు, చరవాణి చా టింగ్‌లతో కొందరు, టీవీ ప్రపంచంలో ఇంకొందరు, దుర్య్వసనాల్లో మరికొందరు తలమునకలైపోయి, సమాజహితం, భవి ష్య తరాల భవితవ్యం మరచిపోయి ప్రవర్తించడం బాధాకరం.

సంస్కారం, విచక్షణ, సచ్ఛీలత వంటి  అంశాలను పాఠ్యపుస్తకా ల్లో చేర్చాలి. కేవలం నైతిక ప్రవర్తన మాత్ర మే సమాజాన్ని సగర్వంగా నిలబెడుతుందని, సంస్కార గుణం మాత్రమే చదువుల కు సార్థకత అనే విషయానికి విద్యా బోధనలో ప్రాధాన్యత పెరగాలి.

ప్రపంచాన్ని మార్చగల ఏకైక సాధనం విద్య అని  నెల్సన్ మండేలా చెప్పిన మా ట అక్షర సత్యం. విద్యవలన జ్ఞానం పెరుగుతుంది. జ్ఞానం వలన ప్రపంచం ప్రగతి పథంలో సాగుతుందని విజ్ఞుల వాదన. ‘అన్నదానం పరం దానం, విద్యాదానమతః పరం’అనే శ్లోకం అన్ని దానాలకంటే అన్న దానం ప్రధానమైనదని, అన్నదానం కంటే కూడా విద్యాదానం మరింత విశిష్టమైనదని సూచిస్తున్నది.

విద్యవలన అన్నీ సాధించవచ్చు. విద్యాధనం సకల సంపదలకు మూలధనం. ఇంతటి ప్రాశస్త్యమైన విద్య వ్యాపార మయమై పోయింది. కేవ లం ఉపాధి కోసం మాత్రమే విద్య...కోట్ల సంపాదనకే జ్ఞానం అన్నట్టుగా మారిపోయింది. పూర్వ కాలంలో విద్యను మూడ వ నేత్రంగా భావించేవారు. 

విద్య అనగా సత్యాన్వేషణకు మూలకారణమని, ఆరోగ్యవంతమైన మనసును సృష్టించేది మా త్రమే విద్య అని గ్రీకు తత్వవేత్త సోక్రటీస్ అభిప్రాయం సర్వకాలాలకు వర్తిస్తుంది. మానవుని బుద్ధిని వికసింపచేసి, సత్ప్రవర్తనను పెంపొందించేదే నిజమైన విద్య అని వివేకానంద చెప్పారు. మనలో నిగూఢమైన శక్తులను వెలికి తేసేది విద్య. విద్య వివేకాన్ని ప్రోది చేయాలి.

సంస్కారమనే కోణాన్ని ఆవిష్కరింపచేయాలి. అయితే నేటి విద్యలు ఇలాంటి లక్షణాలను ప్రేరేపించడం లేదు. విద్యావంతులు సైతం సక ల దుర్లక్షణధారులు గా అవతరించడానికి కారణం విద్యా వ్యవస్థ లోపం. నైతిక ప్రవర్తన నేర్పని విద్యల వలన సమాజం అంధ కార బంధురమై పోతున్నది.  ఒకప్పుడు వి ద్యావిహీనులను పశు సమానులుగా భా వించేవారు.

అయితే నేటి సమాజంలో చదువు కున్న వారి కంటే, అనుభవ జ్ఞా నం గల నిరక్షరాస్యులే  నైతిక విలువలతో జీవించడం గమనార్హం. ఉగ్గుపాలతోనే  వ్యాపారదృక్ఫథంతో ఆంగ్ల భాషను నే ర్పించడం, మాతృభాషను విస్మరించడం వలన అనేక అనర్థాలు జరుగుతున్నాయి.

మాతృ భాషలు మన సంస్కృతీ సాంప్రదాయాలకు, విలువలకు, మానవ సంబం ధాలకు పెద్దపీటవేస్తుంటే, వాటిని కాదని కేవలం అర్థం కాని వయసులో, అర్థంకాని భాషలో విద్యను బోధించడం వలన నష్ట మే తప్ప ఒనగూడే ప్రయోజనం శూన్యం. ఆంగ్ల భాషకున్న ప్రాధాన్యత విస్మరించలేని మాట వాస్తవం.

అదే సందర్భంలో మాతృభాషను తృణీకరించడం ఆక్షేపణీయం. కనీసం ప్రాథమిక స్థాయి వర కైనా మాతృభాషలోనే విద్యాబోధన కొనసాగించడం శ్రేయస్కరం. సకల సమస్యల నుండి సమాజాన్ని కాపాడే నిజమైన ఆయుధం నైతిక విలువలతో కూడిన విద్యాబోధన మాత్రమే. విద్యారంగాన్ని సమూల ప్రక్షాళన గావించాలి.

విద్యావ్యవస్థ సక్రమంగా ఉన్నప్పుడే అన్ని వ్యవ స్థలు సజావుగా పనిచేస్తాయి. వివేకాన్ని  ప్రేరేపించే విద్యావిధానం రూపుదిద్దుకోవాలి. మానవ సంబంధాలకు, నైతిక విలు వలకు అత్యంత ప్రాధాన్యత నివ్వాలి. మనిషిని మనసున్న మనిషి గా చేసి, వివేక వంతమైన సమాజాన్ని సృష్టించడంలో ఉపాధ్యాయుల పాత్ర  కీలక మైనది.

ఉపాధ్యాయులే రాబోవు తరాలకు మార్గదర్శ కులు. విద్యార్థులను ఉత్తమమైన పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులు బాధ్యతాయుతమైన పాత్రను నిర్వర్తించా లి. సకల గుణగణాలతో, అత్యంత క్రమశిక్షణతో జీవితాంతం విద్యారంగానికి కృషి చేసిన మహనీయుల చరిత్రను ఆకళింపు చేసుకోవాలి.

ప్రముఖ వ్యక్తుల దార్శనికతను, చిత్తశుద్ధిని, అంకిత భావాన్ని నేటి ఉపాధ్యాయులు ఆదర్శంగా తీసుకోవాలి.  జాతికి జవసత్వాలు అందించగల నిజమై న విద్యను అందించాలి. ఆలోచన ఆచరణకు దారితీయాలి. సత్సంకల్పంతో అసాధ్యాలు సుసాధ్యం కాగలవు. యువశక్తి విద్యలతో, విలువలతో రాణించాలి. భారతజాతి మహోన్నత ఖ్యాతికి  దోహదపడాలి.

  సుంకవల్లి సత్తిరాజు