calender_icon.png 20 October, 2024 | 1:15 PM

ఉద్దేశపూర్వక నిర్లక్ష్యమా?

20-10-2024 01:43:26 AM

  1. కావాలనే కోర్టు ఆదేశాల్ని అమలు చేయలేదా?
  2. కోర్టుకు వచ్చి వివరణ ఇవ్వండి
  3. హెచ్‌ఎండీఏ కమిషనర్‌కు హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, అక్టోబర్ 19 (విజయక్రాంతి): భవన నిర్మాణాలకు అనుమతుల మంజూరు వ్యవహారంలో హెచ్‌ఎండీఏ తీరును హైకోర్టు ఆక్షేపించింది. కోర్టు ఆదేశాలను అమలు చేయకపోవడానికి కారణా లు చెప్పాలని హెచ్‌ఎండీఏ కమిషనర్‌ను ఆదేశించింది.

కమిషనర్ వ్యక్తిగతంగా విచారణకు హాజరై వివరణ ఇవ్వాలని నోటీసు లు జారీ చేసింది. కోర్టు ధిక్కార చర్యలు ఎం దుకు తీసుకురాదో చెప్పాలని నోటీసుల్లో పేర్కొంది. దరఖాస్తును పరిశీలించి అనుమతులను మంజూరు చేయాలంటూ ఇచ్చిన ఉత్తర్వులను ఎందుకు అమలు చేయలేదో చెప్పాలంది.

గత ఆదేశాలను అమలు చేయకపోవడంపై అక్షయ డెవలపర్స్ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌ను జస్టిస్ వి నోద్ కుమార్ ఇటీవల విచారించారు. పిటిషనర్ తరఫు న్యాయవాది ఎస్ శ్రీధర్ వాది స్తూ సర్వీసు రోడ్డు లేదన్న కారణంతో నిర్మా ణ అనుమతులు నిరాకరించారని తెలిపా రు.

ఇదేప్రాంతంలో గణపతి సచ్చిదానంద అవధూత పీఠం ట్రస్టుకు అ నుమతులిచ్చిన హెచ్‌ఎండీఏ.. అక్షయ డెవలపర్స్ విషయం లో తిరస్కరించినట్లు కోర్టు దృష్టికి తెచ్చారు. అనుమతులు మంజూరుకు హైకోర్టు ఆదేశాలివ్వగా, హెచ్‌ఎండీఏ అప్పీలు చేస్తే  కొట్టి వేసిందని గుర్తు చేశారు.

ఆ తర్వాత కూడా అనుమతులు ఇవ్వలేదని, దీనిని కోర్టు ధిక్కరణగా పరిగణించాలని కోరారు. వాదనల తర్వాత హైకోర్టు, హెచ్‌ఎండీఏ తీరును తప్పుపట్టింది.  కోర్టుకు వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని హెచ్‌ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, ప్లానింగ్ విభాగం డైరెక్టర్  విద్యాధర్‌ను ఆదేశించింది. విచారణను నవంబర్ 15కి వాయిదా వేసింది.