calender_icon.png 21 March, 2025 | 3:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నీళ్లు ఇవ్వకుండా రైతుల నోట్లో మట్టి కొడతారా?

21-03-2025 12:05:19 AM

జగదేవపూర్,మార్చి 20: జగదేవపూర్ మండలంలోని మునిగడప గ్రామంలో పెండింగ్ లో ఉన్న కెనాల్ పనులను పరిశీలించిన గజ్వేల్ నియోజకవర్గ బిఆర్‌ఎస్ పార్టీ ఇంచార్జ్ వంటేరు ప్రతాపరెడ్డి.ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ గతంలోని కెసిఆర్ ప్రభుత్వం కొండ పోచమ్మ సాగర్ నుండి మునిగడప చెరువు వరకు కాల్వ పనులను 99 శాతం పనులను పూర్తి చేయడం జరిగిందన్నారు.

కేవలం ఒక్క శాతం పనులంటే రెండు ప్యాచెస్ పనులు పెండింగ్లో ఉన్నాయి, 40 నుండి 50 గజాలు బ్రిడ్జి కట్టి కెనాల్ ను పూర్తి చేస్తే మునిగడప చెరువులకు నీళ్లు వచ్చి నిండుతుందన్నారు. మునిగడప చెరువు నింపుతే గొల్లపల్లి, మాందాపూర్ దౌలాపూర్ బస్వాపూర్ తిమ్మాపూర్ చాట్లపల్లి, వట్టిపల్లి 10 నుండి 15 గ్రామాల చెరువులను నింపి ఈ ప్రాంత రైతాంగానికి సాగు నీరును అందించడం జరుగుతుందన్నారు.

చెరువులను నింపడం వలన భూగర్భ జలాలు పెరుగుతాయి అన్నారు. దాదాపు కెనాల్ నాలుగు కిలోమీటర్ల పొడవు ఉందని చుట్టూ ఉన్న పంటలకు బోర్ల ద్వారా రైతులు సాగు నీరును పంట పొలాలకు పారించుకోవచ్చని తెలిపారు. గతంలోని కేసీఆర్ ప్రభుత్వం కెనాల్ పనులను 99% పూర్తిచేస్తే ప్రస్తుతమున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క శాతం పనులను కూడా చేయడం లేదని మండిపడ్డారు,.

ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ ఆలేటి ఇంద్రసేనారెడ్డి, మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ గుండా రంగారెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు పనగట్ల శ్రీనివాస్ గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఉ పేందర్ రెడ్డి,,మండల మహిళా అధ్యక్షురాలు స్థానిక మాజీ ఎంపీటీసీ కొత్త కవిత శ్రీనివాస్ రెడ్డి, నాయకులు బుద్ధ నాగరాజు,కిరణ్ గౌడ్,కొంపేల్లి మహేష్ ,సీనియర్ నాయకులు పాల్గొన్నారు.