calender_icon.png 23 January, 2025 | 12:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రేమజంటకు సహకరిస్తావా?

23-01-2025 12:23:20 AM

  1. తెల్లారేసరికి వారు రాకుంటే నిన్ను చంపేస్తాం..
  2. ఓ యువకుడిపై ప్రేమికుల బంధువుల బెదిరింపులు
  3. ముఖంపై ఉమ్మి అవమానించిన వైనం
  4. మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య

నాగర్‌కర్నూల్, జనవరి 22 (విజయక్రాంతి): ప్రేమజంట పారిపోయేందుకు సహకరించాడనే నెపంతో ఓ యువకుడి ఇంటిపై దాడికి దిగి అవమానకరంగా తన ముఖంపై ఉమ్మివేశారు. తెల్లారేసరికి ఆ జంట తిరిగి రాకుంటే చంపేస్తాం అంటూ బంధువులు బెదిరించడంతో అవమానభారం భరించలేక ఆ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా తాడూరు మండలం చర్ల ఇటిక్యాల గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది.

చర్ల ఇటిక్యాల గ్రామానికి చెందిన ఓ యువతి, యువకుడు ప్రేమించుకున్నారు. వారిద్దరూ సోమవారం ఊరి నుం  వెళ్లిపోయారు. వారికి అదే గ్రామానికి చెందిన వంకేశ్వరం సాయి(23) సహకరించాడనే అను  మంగళవారం ఆ ప్రేమజంట బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అనంతరం శంబయ్య, ఎద్దుల శివ, బాల్‌రాజు, అనుపటి కాసీం, నరేందర్‌రెడ్డి కలిసి వంకేశ్వరం సాయి ఇంటికి వెల్లి యువకుడితోపాటు తల్లిదండ్రులపై దాడి చేసి చేశారు. వారి ముఖంపై ఉమ్మారు. తెల్లారేసరికి ప్రేమజంట తిరిగి రావాలని లేదంటే నిన్నే చంపుతామంటూ సాయిని బెదిరించారు.

దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన సాయి బుధవారం ఉదయం పొలం వద్ద చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీనిపై కేసు దర్యాప్తు చేపట్టినట్టు ఏఎస్సై స్వామి తెలిపారు.