డీజిల్, పురుగుల మందు డబ్బాతో రైతు ఆందోళన
నిర్మల్, డిసెంబర్ 30 (విజయక్రాంతి): తన సమస్యను పరిష్కరించడం లేదని ఓ రైతు సోమవారం నిర్మల్ కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో డీజిల్, పురుగుల మందు డబ్బాతో ఆవేదన వ్యక్తం చేశాడు. సోన్ మండలంలోని న్యూవెల్మల్ గ్రామానికి చెందిన రాజవ్వ పేరున 20 గుంటల భూమి ఉండేది.
ఆ గ్రామం ముంపునకు గురికావడంతో రెవెన్యూ అధికారులు లక్ష్మణచాంద మండలం పొట్టపల్లి కె లో 20 గుంటల భూమిని కేటాయించారు. కానీ పొజిషన్ చూపలేదు. ఆ భూమికి సంబంధించిన పట్టాపాసుపుస్తకం పహాణి, టైటిల్ డీడీ ఉన్నప్పటికీ రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహిం చి పొజిషన్‌లో చూపించాలని నాలుగేళ్లుగా ఆర్డీవో, కలెక్టర్ కార్యాలయాల్లో వినతిపత్రం అందించినా పట్టించుకోవడం లేదని రాజ వ్వ కొడుకు ముకేశ్ ఆవేదనకు గురయ్యాడు.
తమకు కేటాయించిన భూమి వద్దకు వెళ్తే తమది కాదంటూ కొందరు దాడులు చేస్తున్నారని ఆరోపించాడు. దీంతో ముకేశ్ సోమ వారం కలెక్టరేట్‌కు వెళ్లగా సిబ్బందికి డీజిల్ వాసన రావడంతో అప్రమత్తమై బ్యాగులు తనిఖీ చేసి డీజిల్, పురుగుల మందు డబ్బాను లాక్కున్నారు. దీంతో సమస్యను, పరిష్కరించరు, చావనీయరా అంటూ ముకే శ్ ఆందోళన చేశారు. అదనపు కలెక్టర్ కిషోర్‌కుమార్ రైతుతో మాట్లాడారు. వచ్చే నెల 2వ తేదీలోగా రెండు మండలాల అధికారులు జాయింట్ సర్వే నిర్వహించి పొజిషన్ చూపించాలని ఆదేశించారు.