calender_icon.png 19 November, 2024 | 11:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సిప్ చేస్తారా!

10-11-2024 12:00:00 AM

నెలనెలా పొదుపుతో పెద్ద మొత్తాన్ని సమకూర్చుకునే 

సాధనం సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్

క్రమం తప్పకుండా మదుపుచేయడం ద్వారా దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల్ని సాధించడానికి సిస్టామ్యాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్ (సిప్‌లు) తప్ప మరో పెట్టుబడి సాధనం లేదని పర్సనల్ ఫైనాన్స్ నిపుణులు చెపుతుంటారు. పలు మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌ల్లో ఈ ప్లాన్స్ ద్వారా మదు పు చేయవచ్చు.

ప్రతీ నెలా నిర్ణీత మొత్తాన్ని పొదుపు చేయడం ద్వారా రిటైర్‌మెంట్ ఫండ్, కొత్త గృహం కొనుగోలు, పిల్లల ఉన్నత చదువులు వంటి దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడానికి ఇవి  అనువైనవి. మీరు చేసే మదుపును మ్యూచువల్ ఫండ్స్ స్టాక్స్, బాండ్లు తదితరాల్లో పెట్టుబడి చేస్తా యి.

వాటితో వచ్చే లాభాలను తిరిగి పెట్టుబడి చేసి అదనపు రాబడుల్ని తీసుకురా వడం ద్వారా మీ డబ్బును వృద్ధి చేస్తాయి. దీర్ఘకాలం పాటు వీటిలో పెట్టుబడి చేస్తేనే ఈ ప్రయోజనం లభిస్తుంది.

దీంతో పాటు  మ్యూచువల్ ఫండ్స్ నిర్వహించే సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్  క్రమశిక్షణతో పెట్టుబడి చేసే అలవాటును కూడా ఇన్వెస్టర్లకు అలవరుస్తాయి. ఒక్కసారి మీరు సిప్‌లో మదుపు చేయడం ప్రారంభిస్తే వీటిలో ప్రతీ నెలా కొంత పొదుపును పెట్టుబడిచేయడం ఒక అలవాటుగా మారిపోతుంది.

ఇలా ఆరంభించండి

మీరు ఎంతకాలంలో ఎంత నిధిని సమకూర్చుకోవాలన్న లక్ష్యాన్ని నిర్ణయించుకు న్నారో, ఆ మేరకు నిర్ణీత మొత్తాన్ని ప్రతీ నెలా మీరు ఎంచుకునే సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌లో పెట్టుబడి చేయడం ఆరంభించాలి. అలా చేస్తానే మీ దీర్ఘకాలిక లక్ష్యం నెరవేరుతుంది. ఉదాహరణకు ప్రతీ నెలా మీరు రూ.1,000 సిప్ లో పెట్టారనుకోండి.

ఆ పొదుపు దీర్ఘకాలంలో కోటి రూపాయిల నిధి చేతికొస్తుంది. మ్యూచువల్ ఫండ్స్ ఆఫర్ చేసే సిప్ స్కీమ్‌ల్లో పెట్టుబడి చేసే సమయాన్ని (అంటే నెలవారీ లేదా త్రైమాసికోసారి) మీరే ఎంచుకోవచ్చు. రూ.500 కనిష్ఠ వాయిదా చెల్లింపును సైతం ఎంపిక చేసుకునే అవకాశం ఉన్నది.

ఒకరకంగా చెప్పాలంటే ఇది బ్యాంక్‌లో వేసే రికరింగ్ డిపాజిట్ లాంటిదే. ప్రతీ నెలా లేదా ప్రతీ మూడు నెలలకు మీరే గుర్తుపెట్టుకుని చెల్లించే అవసరం లేకుండా, ఆటోమ్యాటిక్‌గా మీ బ్యాంక్ ఖాతా నుంచి చెల్లింపు జరిగే స్టాండర్డ్ ఇన్‌స్ట్రక్షన్‌ను కూడా మీ బ్యాంక్‌కు ఇవ్వవచ్చు. 

పాపులర్ పెట్టుబడి సాధనం

ఇప్పుడు పలువురు ఇన్వెస్టర్లలో సిప్ పెట్టుబడి బాగా పాపులర్ అయ్యింది. మార్కెట్ల ఒడిదుడుకుల పట్ల, పెట్టుబడి చేసే సమయం పట్ల ఆందోళన లేకుండా క్రమశిక్షణతో పొదుపు చేసే అవకాశం సిప్‌లతో లభిస్తున్నది. దీర్ఘకాలిక పెట్టుబడుల కోసం పెట్టుబడుల ప్రపంచంలో ప్రవేశించడానికి ఉత్తమ సాధనం సిప్‌లేనని పర్సనల్ ఫైనాన్స్ నిపుణులు సూచిస్తుంటారు. 

రూ.1 కోటి నిధి కావాలంటే..

మీ ఆర్థిక లక్ష్య సాధనకు మీరు ప్రతీ నెలా రూ. 1,000 పెట్టుబడి చేస్తే రూ.1 కోటి నిధిని దీర్ఘకాలంలో పొందవచ్చు. అలాగే మీరు కాస్త ముందుగా కోటి రూపాయిలు సంపాదించడానికి నెలవారీగా రూ. 2,000, రూ.3,000, రూ.5,000 చొప్పున కూడా మదుపు చేయవచ్చు.

ప్రతీ నెలా ఎంత సిప్‌ల్లో ఎంత ఇన్వెస్ట్ చేస్తే, ఎంతకాలంలో ఆ నిధిని పొందవచ్చో తెలుసుకుందాం. మ్యూచవల్ ఫండ్స్ గత రాబడుల్ని పరిశీలిస్తే పదేండ్లలో అవి 14-15 శాతం చొప్పున వార్షిక రాబడుల్ని అందించాయి. ఇలా భవిష్యత్తులో కూడా 14 శాతం రాబడిని ఇస్తే ఎంత సిప్ చేస్తే ఎంతకాలానికి కోటి రూపాయలు చేకూరుతుందంటే..

నెలవారీ రూ.1,000 సిప్

ప్రతీనెలా రూ. 1,000 చొప్పున ఇన్వెస్ట్ చేస్తే రూ.కోటి నిధి 35 ఏండ్లలో సమకూరుతుంది. నెలవారీ రూ.1,000 సిప్ చేస్తే, ఆ స్కీమ్ 14% చొప్పున వార్షిక రాబడిని ఇస్తే 35ఏండ్లలో రూ.1.12 కోట్లు చేతి కి అందుతుంది. అది ఎలాగంటే..

మీరు చేసే మొత్తం పెట్టుబడి: రూ.4,20,000

అంచనా రాబడి: రూ.1,08,12,486

మొత్తం విలువ: రూ.1,12,32,486

నెలవారీ రూ.3,000 సిప్

ప్రతీ నెలా రూ. 3,000 చొప్పున ఇన్వెస్ట్ చేస్తే రూ.కోటి నిధి 27 ఏండ్లలో సమకూరుతుంది. నెలవారీ రూ.3,000 సిప్ చేస్తే, ఆ స్కీమ్ 14 శాతం చొప్పున వార్షిక రాబడిని ఇస్తే 27 ఏండ్లలో రూ. 1.09 కోట్ల నిధి అవుతుంది. 

మొత్తం పెట్టుబడి: రూ.9,72,000

అంచనా రాబడి: రూ.99,19,599

మొత్తం విలువ: రూ.1,08,91,599

నెలవారీ రూ.5,000 సిప్

ప్రతీ నెలా రూ. 5,000 చొప్పున ఇన్వెస్ట్ చేస్తే రూ.కోటి నిధి 23 ఏండ్లలో సమకూరుతుంది. నెలవారీ రూ.3,000 సిప్ చేస్తే, ఆ స్కీమ్ 14 శాతం చొప్పున వార్షిక రాబడిని ఇస్తే 23 ఏండ్లలో రూ.1.02 కోట్ల నిధి అవుతుంది. 

 మొత్తం పెట్టుబడి: రూ.13,80,000

అంచనా రాబడి: రూ.88,37,524

మొత్తం విలువ: రూ.1,02,17,524