calender_icon.png 13 November, 2024 | 7:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మీ కమీషన్ల కోసం రైతులను బలి పెడతారా?

10-11-2024 01:42:32 PM

మిత్తీతో సహా వడ్ల పైసలన్నీ కేంద్రమే ఇస్తోంది

సుతిలి తాడుసహా రవాణా ఖర్చులన్నీ భరిస్తోంది

వడ్ల కొనడానికి మీకున్న నొప్పేంది?

ఏం సాధించారని ప్రజా విజయోత్సవాలు?

ప్రజా వంచన ఉత్సవాలు చేసుకోండి

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఫైర్...

కరీంనగర్ (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా శంకరపట్నంలోని కొత్తగట్టులో వడ్ల కొనుగోలు కేంద్రాల సందర్శించిన కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజాయ్. ఈ సందర్బంగా రైతుల ఇబ్బందులను స్వయంగా అడిగి తెలుసుకున్న కేంద్ర మంత్రి నెలరోజులుగా వడ్లు తెచ్చినా ఎవరూ కొనడం లేదని రైతుల ఆవేదన వ్యక్తం చేసారు. కాంగ్రెస్ ప్రభుత్వం బోనస్ పైసలివ్వకుండా తప్పించుకోవడానికి వడ్ల కొనుగోలు చేయకుండా జాప్యం చేస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. బ్రోకర్ల నుండి కమీషన్లు దండుకునేందుకు రాష్ర రైతుల ప్రయోజనాలను బలి పెడుతున్నారని ధ్వజమెత్తారు. వడ్ల పైసలన్నీ మిత్తీతోసహా కేంద్రమే చెల్లిస్తోందన్నారు. అయినప్పటికీ వడ్లు కొనివ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చిన మిత్తీతో సహా నొప్పి ఏందని ప్రశ్నించారు.

ఏడాది పాలనపై కాంగ్రెస్ పార్టీ ప్రజా విజయోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించడంపైనా బండి సంజయ్ తనదైన శైలిలో సెటైర్లు వేశారు. ‘‘ఏం సాధించారని ప్రజా విజయోత్సవాలు చేసుకుంటున్నారు? 6 గ్యారంటీలు అమలు చేశారని విజయోత్సవాలు చేసుకుంటున్నారా? నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు, మహిళలకు తులం బంగారం, స్కూటీ, నెలనెలా రూ.2500 లు ఇచ్చారని విజయోత్సవాలు చేసుకుంటారా? వ్రుద్దులకు రూ.4 వేల ఆసరా పెన్షన్ ఇచ్చారని చేసుకుంటారా? పేదలకు ఇండ్లు ఇచ్చారని చేసుకుంటారా? దేనికోసం విజయోత్సవాలు.. నమ్మించి ఓట్లేయించుకుని మోసం చేసినందుకు  ప్రజా వంచన ఉత్సవాలు చేసుకోండి.’’అంటూ దుయ్యబట్టారు.