calender_icon.png 25 October, 2024 | 3:56 AM

మళ్లీ స్పందిస్తుందా?

07-07-2024 12:05:00 AM

“నేను సమంత ఆరోగ్య పరిస్థితిని అర్థం చేసుకున్నాను. ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. ఆమె చెప్పిన హెల్త్ టిప్‌ను నేను ఖండించిన వ్యవహారంతో ఆమె బాధపడ్డారు. ఇందుకు నేను క్షమాపణలు కోరుతున్నాను. సమంతను విమర్శించడం నా ఉద్దేశం కాదు.. ఆమెకు చికిత్స చెప్పిన డాక్టర్‌ది తప్పు. సొంత లాభం కోసం ఆ డాక్టర్ సమంత లాంటి సెలబ్రిటీల ద్వారా హానికరమైన సమచారాన్ని ప్రజలకు అందిస్తున్నారు.. దీన్నే నేను ఖండించాను. అంటూ డాక్టర్ లివర్ డాక్ తన సోషల్ మీడియా ఖాతాలో సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. కొన్ని రోజులుగా సమంతకు, డాక్టర్ లివర్ డాక్‌కు సోషల్ మీడియా వేదికగా మాటల యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే.

సమంత హెల్త్ టిప్ విషయంలో తీవ్రమైన పదజాలంతో డాక్టర్ లివర్ డాక్ ఆమెని దూషించారు. దీనిపై సమంత స్పందిస్తూ పోస్ట్‌తో కౌంటర్ ఇచ్చింది. ప్రతిగా డాక్టర్ డాక్ తాజాగా క్షమాపణలు తెలిపారు. ఇదిలా ఉండగా, సమంతకు వైద్యం అందించే వైద్యున్ని.. డాక్టర్ డాక్ తీవ్రంగా విమర్శించారు. ఆయనపై ఇప్పటికే కొన్ని కేసులు ఉన్నాయని పేర్కొన్నారు. ఎంబీబీఎస్ చేసిన వ్యక్తి కాదని, ఆయనో ప్రకృతి వైద్యుడని తెలిపారు. గతంలో ప్రజారోగ్యానికి హాని కలిగించే ఉత్పత్తులను ప్రోత్సహించినందుకు గాను ఆయనపై ప్రభుత్వం చర్యలు తీసుకున్నదని డాక్ పేర్కొన్నారు.

అయితే డాక్ చేసిన తాజా పోస్టుపై సమంత స్పందిస్తుందా? అతని క్షమాపణలను స్వీకరిస్తుందా? లేక తనకు వైద్యం అందిస్తున్న ఆ డాక్టర్ గురించి ఏమైనా ఆరా తీస్తుందా? అన్న కోణాల్లో సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ తరుణంలో సమంత ఏం చేస్తుందో మరి!