13-02-2025 12:47:04 AM
*-మున్సిపాలిటీకి అద్దె షాపుల నుంచి ప్రతి నెలా రూ.40 లక్షలు రాక
*-అద్దెలు చెల్లించడంలో షాపుల నిర్వాహకుల నిర్లక్ష్యం
*-పాలమూరు మున్సిపాలిటీలో రూ.23 కోట్ల అద్దె బకాయిలు
*-షాపులను సీజ్ చేసి చెల్లించాలి అంటున్న మున్సిపల్ అధికారులు
* -ఒకేసారి చెల్లించలేమంటూ అధికారుల చుట్టూ ప్రదక్షణ చేస్తున్న షాపులు నిర్వాహకులు
మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 12 (విజయ క్రాంతి): ఎలాగైనా ఓపెన్ టెండర్‌లో మున్సిపల్ పరిధిలో ఉన్న షాపులు దక్కించు కోవాలని తెగ ప్రయత్నాలు చేసిండ్రు దక్కిం చుకున్నారు. తీరా దక్కించుకున్న తర్వాత ఇక చూద్దాంలే ముందు వ్యాపారం చేసుకుందాం పోగు చేసుకుందాం అద్దె డబ్బులు చూద్దాం.. కడుదాం.. అన్నట్టు వ్యవరిస్తున్నారు కొందరు మున్సిపల్ పరిధిలో ఉన్న అద్దె భవనాలను దక్కించుకున్న నిర్వాహకులు.
మహబూబ్ నగర్ మున్సిపల్ పరిధిలో 258 షాపులు ఉన్నాయి. వీటిలో 235 షాపులు ప్రస్తుతం నడుస్తున్నాయి. మరో 23 షాపులలో కొందరు అద్దెలు చెల్లించక పోవ డంతోపాటు తాళం వేసుకొని వెళ్లిపోగా మరికొన్ని షాపులు మరమ్మతులు చేసే పనిలో ఉన్నాయి.
మున్సిపల్ పరిధిలోని షా పులకు బహిరంగ అద్దె వేలం నిర్వహించి అత్యధిక వేలం పొందిన వారికి షాపులను కేటాయించడం జరిగింది. ఇక్కడికి వరకు బాగానే ఉన్నా అద్దెలు చెల్లించడంలో మా త్రం కొంతమంది తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తు న్నారు. తాళాలు చేతిలో పట్టుకొని షాపుల ముందు నిల్చోని ఆ షెటర్లు మూసి తాళం వేస్తే తప్ప అద్దెలు చెల్లించేందుకు ముందుకు రావడం లేదు.
రూ. 23 కోట్ల అద్దె బకాయిలు
రోజురోజుకు మున్సిపల్ శాఖ పరిధిలో ఉన్న అద్దె షాపుల బకాయలు పేరుకుపోతు న్నాయి. మున్సిపల్ కు ఈ దిశగా వస్తున్న ఆదాయానికి గండి పడుతుంది. ప్రతి నెల రూ 40 లక్షల ఆదాయం అద్దె రూపంలో మున్సిపాలిటీకి చేరాలి. చాలామంది అద్దె భవనాల నిర్వాహకులు అద్దె చెల్లించడంలో నిర్లక్ష్యం వహించడంతో రూ 23 కోట్లు బకాయిలు పడ్డాయి.
క్లబ్ టవర్ లోని ఓ రెండు మెడికల్ షాపులు నిర్వాకులు రూ. 1,80,000, మరొకరు రూ 1,70,000 ప్రతినెల అద్ద చెల్లించేందుకు వేలంపాటలో అత్యధికంగా పాడి షాప్ లో దక్కించుకు న్నారు. అద్దె చెల్లించడంలో మాత్రం వెన కంజ వేస్తున్నారు.
బతుకు చూపిస్తున్న షాపు అద్దె చెల్లించకుంటే ఎలా..?
బతుకుదెరువు చూపిస్తున్న ఆయా షాపు ల హద్దులు చెల్లించకుండా నిర్లక్ష్యం వహిస్తే ఎలా అని పట్టణవాసులు ప్రశ్నిస్తున్నారు. వివిధ ప్రవేట్ బిల్డింగ్లలో షాపులు నిర్వహి స్తున్నవారు అద్దె ఎక్కువైనా ప్రతినెల చెల్లిస్తూ వారి వ్యాపారాలను చేసుకుంటూ ముందు కు సాగుతున్నారు.
ప్రభుత్వ షాపులే కదా అని అద్దెలు చెల్లించడంలో నిర్లక్ష్యం వహిస్తూ వారికి తెలిసిన వారి నుంచి ఫోన్లు చేయించి ఇప్పుడు కడతాం అప్పుడు కడతామంటూ నెలల కొద్దిగా పెండింగ్లో పెడుతూ వస్తు న్నారు. మున్సిపల్ అద్దె భవనాల షాపుల నిర్వాహకులు.
దాదాపు 5 6 నెలల నుంచి కూడా హత్యలు చెల్లించడంలో కొంతమంది నిర్లక్ష్యం వహించడంతో మున్సిపల్ అధికా రులు తాళాలు చేతిలో పట్టుకొని పట్టణంలో ని పలు షాపులను సీజ్ చేశారు. సీజ్ చేసిన షాపుల నిర్వాహకులు అధికారుల చుట్టూ ప్రదక్షణలు చేస్తూ అంతా ఒకే మారు చెల్లించలేమంటు కొందరు అడుగుతుండ్రు.
అంత చెల్లించలేం...
గతంలో మున్సిపల్ కమిషనర్ మమ్మల్ని తప్పుదోవ పట్టించారు. ఒక్క రు ఒకటే షాపుకు ఓపెన్ టెండర్లు పా ల్గొనాలని చెప్పారు. ఓపెన్ టెండర్లు షాపులు దక్కించుకున్న తర్వాత అప్పటి ప్రభుత్వం ముందు ఉన్న అద్దెకు 300% అదనంగా చెల్లించాలని చెప్పడం జరిగింది.
ఇప్పటివరకు అదే అద్దె లను చెల్లింపులను చేశాం. జీవ ప్రకారం మాకు ఎలాంటి హామీ లేదు. గత ప్ర భుత్వంలో ఇచ్చిన హామీ మేరకు మే ము ముందుకు సాగుతున్నాం. ఓపెన్ టెండర్‌లో పాల్గొని వేలం దక్కించు కున్న ప్రకారం హద్దులు చెల్లించాలంటే చాలా కష్టం.
- నరేందర్, మధ్య షాపు యజమాని