‘హాస్టల్ హుడుగరు బేకాగిద్దారె’ సినిమాలో తన అనుమతి లేకుండా తన వీడియోలను వాడుకున్నారని ఆరోపిస్తూ నటి, మైసూరు మాజీ ఎంపీ రమ్య నగరంలోని వాణిజ్య వ్యాజ్యాల న్యాయస్థానాన్ని ఆశ్రయిం చారు. చిత్ర నిర్మాత నుంచి తనకు రూ.కోటి పరిహారాన్ని ఇప్పించాలని ఆమె తన వ్యాజ్యంలో కోరారు.
సినిమా నుంచి తన వీడియోను తొలగించాలని పలుమార్లు కోరినా నిర్మాతలు స్పందించలేదని ఆమె ఆరోపించారు. ఆ వీడియోను తొలగిస్తే దావాను వెనక్కు తీసుకుంటానని రమ్య తెలిపారు. తన న్యాయవాదితో కలిసి న్యాయస్థానానికి వచ్చి తన వద్ద ఉన్న దాఖలాలలను అందజేసి వెళ్లారు.