బీజేపీ ఎమ్మెల్యే హరీశ్‌బాబు
హైదరాబాద్, జూలై 30 (విజయక్రాంతి): సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు అసెంబ్లీలో మంగళవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. దక్షిణ తెలంగాణలోని ప్రాజెక్టులపై ఉన్న శ్రద్ధ ఉత్తర తెలం గాణపై లేదని.. తమపై వివక్ష ఎందుకని ప్రశ్నించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు, తన నియోజకవర్గానికి నిధులిస్తారా? లేకుంటే మహారాష్ట్రలో కలుపుతారా? అని ప్రభుత్వాన్ని నిలదీశారు. మహారాష్ట్రలో కలిపినా తమకు ఎలాంటి అభ్యంతరం లేదని అన్నారు.
వెనుకబడిన ప్రాంతాలపై హౌజ్ కమిటీని వేయాలని డిమాండ్‌చేశారు. మిగతా జిల్లాల కంటే తమ జిల్లా తలసరి ఆదాయం చాలా తక్కువగా ఉందని, ప్రజల జీవన ప్రమాణాలు పెంచాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పౌరసరఫరాల శాఖ కార్పొరేషన్‌కు రైస్ మిల్లర్లు రూ.50 వేల కోట్లు బకాయిలు ఉన్నట్టు చెప్పిన ఆ శాఖ మంత్రి, అదే బడ్జెట్ ప్రసంగంలో మాత్రం రూ.3 వేల కోట్లు రికవరీ చేస్తున్నామని అనటం వెనుక మతలబు ఏమిటని ప్రశ్నించారు. వార్ధా లేదా తుమ్మిడిహట్టీ వద్ద ప్రాజెక్టును నిర్మించవచ్చని, దీనికి బీజేపీ ఎమ్మెల్యేలు సహకారం అందిస్తామని చెప్పారు.