నాగం జనార్దన్‌రెడ్డి
నాగర్‌కర్నూల్, డిసెంబర్ 30 (విజయక్రాంతి): ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి ప్రాంతాలకు తాగు, సాగు నీటి కోసం నిర్మించబడ్డ పాలమూ రు ప్రాజెక్టు నుంచి నల్లగొండకు నీళ్లు తరలించేలా డిండి ప్రాజెక్టుకు ఏదుల నుంచి గండి కొట్టి తరలిం పు ప్రతిపాదన దారుణమని మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డిరెడ్డి ధ్వజమెత్తారు. నల్లగొండ కోసం పాల మూరును ఎండగడతారా అని ప్రశ్నించారు. సోమవారం నాగర్‌కర్నూల్‌లో మాట్లాడారు. త్వరగా ఎస్ ఎల్బీసీ పూర్తి చేసి డిండికి నీటిని తరలించేలా చర్యలు తీసుకోవాలన్నారు.