calender_icon.png 23 September, 2024 | 10:05 AM

వస్తారా? కొరడా ఝుళిపించాలా?

23-09-2024 01:32:20 AM

ప్రభుత్వం ఏదైనా.. సీఎం సీటులో ఎవరు కూర్చున్నా.. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలపై కన్నేయడం పరిపాటిగా మా రింది. సర్కార్‌కు బొటా బొటి మెజార్టీ ఉన్నా.. పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేల మద్దతున్నా ఫిరాయింపులను ప్రోత్సహిం చడం ఆగట్లేదు. ఎమ్మెల్యేల బలహీనతలు,  అధికారంలో ఉన్నప్పుడు వారు చేసిన తప్పొప్పులే అధికార పార్టీ అస్త్రాలుగా వాడుకొంటుంది. ఇటీవల కారు దిగి హస్తం గూటికి వచ్చిన వాళ్లలో కొం దరు ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు గత బీఆర్‌ఎస్ హయాంలో ఎదురు లేకుండా ఉన్నవారే కావడం గమనార్హం. ప్రభుత్వం మారాక ఇబ్బందులు వస్తాయనే.. ముం దు జాగ్రత్తగా గులాబీ కండువా పక్కన పెట్టి మూడు రంగుల కండువాలను క ప్పుకొన్నారట.

ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్‌కు కావాల్సింది అదే కదా? రేవంత్‌రెడ్డి సర్కార్ మూడు నెలలు కూడా ఉండదని ఒకాయన, ఆరు నెలలు కూడా కొనసాగదని మరొకాయన శాపనార్థాలు పెట్టారు. వాటినే ఆసరాగా చేసుకున్న రేవంత్‌రెడ్డి.. తన అధికారానికి పదును పెట్టారట. పార్టీలోకి వచ్చే వారి కోసం వేట మొదలెట్టా రట. అందులో కొన్ని చేపలు వలకు చి క్కాయని, మరికొందరి కోసం వేట కొనసాగుతుందని.. మాట వినకపోతే కొరడా ఝలిపిస్తామని సర్కార్‌లోని పెద్దల నుం చి హెచ్చరికలు వెళ్తున్నాయట. బయపడి పార్టీ మారుతారో? ఉన్నపార్టీలోనే కొనసాగుతారో మున్ముందు చూడాల్సిందే.