calender_icon.png 20 March, 2025 | 7:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మా ప్రాణం తీసి పరిశ్రమలు పెడుతరా?

20-03-2025 01:20:45 AM

  • ఇండస్ట్రియల్ పేరుతో భూములు లాక్కుంటే ఊరుకోం

అధికారులపై మర్లబడ్డ చౌటపల్లి వాసులు

హుస్నాబాద్, మార్చి 19: తాము సాగుచేసుకుని బతుకుతున్న భూముల్లో పరిశ్ర   పెట్టాలనుకుంటున్న మంత్రి పొన్నం ప్ర  తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం చౌటపల్లివాసులు డిమాండ్ చేశారు. గ్రా మంలో ప్రతిపాదిత ఇండస్ట్రియల్ పార్కుకు తమ భూములు ఇవ్వబోమని తేల్చి చెప్పా రు. బుధవారం హుస్నాబాద్ ఆర్డీవో రా మ్మూర్తి ఆధ్వర్యంలో జరిగిన గ్రామసభలో రైతులు తమ వ్యతిరేకతను వ్యక్తం చేశారు.

చౌటపల్లి, జనగామ, తోటపల్లి గ్రామాలకు చెందిన రైతులు గ్రామసభకు హాజర  రు. సర్వే నంబర్ 312లో గతంలోనే ప్రభు త్వం 150మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ కు  5నుంచి 20గుంటల వరకు సాగు కోసం భూమి ఇచ్చిందన్నారు.

తమ తాతల కాలం నుంచి ఆ భూమిని సాగు చేసుకుం టు జీవిస్తున్నామని తెలిపారు. జీవనాధరమైన భూములను పరిశ్రమల కోసం ఇవ్వ బోమన్నారు. భూములు లాక్కోవద్దని కోరారు. ఇండస్ట్రియల్ పార్కు నిర్మించాలనే ఆలోచన మానుకోవాలని లేదంటే తమకు చావే శరణ్యమవుతుందంటూ ఆర్డీవోకు వినతిపత్రం ఇచ్చారు.