16-03-2025 01:57:23 AM
శాసన సభా వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
హైదరాబాద్, మార్చి 15 (విజయక్రాంతి): విద్యా సంస్థలకు ఇవ్వాల్సిన రీయింబర్స్‌మెంట్ బకాయిలు, రాష్ట్ర చిహ్నంలో కాకతీ యుల కళాతోరణం, చార్మినార్ తొలగింపై బీఆర్‌ఎస్ సభ్యుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రభుత్వంపై అసెంబ్లీలో విమర్శలు గుప్పించారు. పల్లా వ్యాఖ్యలకు శాసనసభా వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కౌంటర్ ఇచ్చారు. బకాయిల పాపం బీఆర్‌ఎస్‌దేనని, ఆ పార్టీ నేతలు పాపాన్ని తమ ప్రభుత్వంపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిప్డడారు.
బకాయిలు ఉన్నా యో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేయొద్దని హితవు పలికారు. తమ ప్రభుత్వం 15 నెలలుగా ఒక్కో బకా యి చెల్లిస్తూ వస్తున్నదని తెలిపారు. బీఆర్‌ఎస్ 2014 23 వరకు ఒక్కసారైనా కాకతీయ ఉత్సవాలను నిర్వహించలేదని మండిపడ్డారు. తెలం గాణ అస్తిత్వాన్ని కాపాడే బాధ్యతను కాం గ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందని స్పష్టం చేశారు.