సామాజిక అంశాలపై స్పందిస్తూ తరుచూ వార్తల్లో ఉండేవాళ్లలో సమంత ఒకరు. విషయం ఏదైనా తన మనసులో ఉన్న అభిప్రాయాన్ని కుం డ బద్ధలు కొట్టడం ఆమెకు అలవాటు. అలా తనదైన శైలిలో స్పందిస్తూ ఇన్‌స్టాలో పోస్ట్‌లు పెడుతుంటారామె. తాజాగా సమంత తన ఇన్‌స్టాలో కొన్ని ఫొటోలు పోస్ట్ చేశారు.
అయితే అవి క్షణాల్లో వైరల్ అయ్యాయి. సమంత ఫొటోలు అంత త్వరగా నెట్టింట్ రీచ్ అవడం బహుషా ఇదే తొలిసారి కాబోలు! ఈ ఫొటోల్లో సమంత గతంలో ఎన్నడూ కనిపించని విధంగా సరికొత్తగా ఉండటం ఇందుకు కారణం. ఎవరూ ఊహించని ఈ లుక్‌లో అచ్చం .. మగాళ్ల మాదిరిగా జుట్టు మొత్తం ఒకవైపు దువ్వుకొని, బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకుని ఫొటోలకు ఫోజులిచ్చింది.
సామాజిక మాధ్యమాల్లో ఈ ఫొటో లు చూసిన వారంతా వామ్మో.. ఇదేం లుక్.. అంటూ ఆశ్చర్యపోతున్నారు. ‘లోదుస్తులు లేకుండా ఈ దుస్తులు ధరించావ్.. మరో అమీజాక్సన్ అవుతావా..’ అంటూ మరికొందరు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. అయితే ఓ మ్యాగజైన్ కవర్ పేజీ కోసం నిర్వహించిన ఫొటోషూట్‌కు సంబంధించిన ఫొటోల్లో సమంత ఈ లుక్‌లో కనిపించారని తెలుస్తోంది.