calender_icon.png 27 October, 2024 | 2:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డాక్టర్‌గా చేగువేరా..

01-07-2024 12:00:00 AM

ఎర్నెస్టో చేగువేరా.. దక్షిణ అమెరికా ఖండపు విప్లవకారుడు. రాజకీయ నాయకుడు. క్యూబా ప్రభుత్వంలో కాస్ట్రో తర్వాత అంతటి శక్తివంతుడైన నాయకుడు. అర్జెంటీనాలోని రొసారియా అనే పట్టణంలో 1928 జూన్ 14న ఒక మధ్య తరగతి కుటుంబంలో చే జన్మించాడు. 1953లో బ్యూనస్ ఎయిర్స్ విశ్వవిద్యాలయం నుంచి వైద్య విద్యలో పట్టా పొందాడు. ఆ తర్వాత మోటారు సైకిల్‌పై దక్షిణ అమెరికా ఖండమంతటా పర్యటిస్తున్న సమయంలో ప్రజల జీవన స్థితిగతులను గురించి తెలుసుకున్నాడు. విప్లవ మొక్కటే సామాజిక అసమానతలను తొలగించగలదని భావించాడు. 1950వ దశకం చివరలో క్యూబా నియంత బాటిస్టా కు వ్యతిరేకంగా కాస్ట్రో ఆధ్వర్యంలో జరిగిన గెరిల్లా పోరాటంలో ముఖ్య పాత్ర పోషించాడు.

డాక్టర్‌గా మిలిటరీ కమాండర్‌గా సేవలందించాడు. ఈ సమయంలోనే ఇతను ‘చే’గా పిలువబడ్డాడు. చేగువెరా క్యూబా ప్రతినిధిగా అనేక దేశాలు పర్యటించాడు. ఈ పర్యటనలో భాగంగానే తను రోగులకు వైద్యం చేస్తూ.. 1959 జూలై నెలలో భారతదేశంలో కూడా అడుగు పెట్టాడు. మూడో ప్రపంచ దేశాల మీద అమెరికా పెత్తనాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన చే క్యూబా సామ్యవాద దేశంగా మారటానికి దోహదపడ్డాడు. ప్రపంచంలో ఎక్కడ అన్యాయం జరిగినా ఎదురించడానికి సిద్ధంగా ఉండు అని పిలుపునిచ్చాడు. అలా 1967 అక్టోబర్ 9న బొలీవియా సేనలకు చిక్కిన పోరాటయోధుడు చే గువేరా హత్యకు గురయ్యారు. మరణం దేహానికే కానీ ఆలోచనలకు కాదని చరిత్ర నిరూపించింది.