calender_icon.png 17 March, 2025 | 9:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు కృషి చేస్తా: ఎంపీ చామల

17-03-2025 01:09:51 AM

 చేర్యాల, మార్చి 16:  చేర్యాల రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు తన వంతు కృషి చేస్తానని చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి చేర్యాల పట్టణానికి వచ్చిండన్న సమాచారం మేరకు చేర్యాల రెవెన్యూ డివిజన్ జెఏసి చైర్మన్ రామగళ్ళ పరమేశ్వర్ ఆధ్వర్యంలో ఎంపీని కలిశారు.ఈ సందర్భంగా చేర్యాల రెవెన్యూ డివిజన్ ప్రాముఖ్యతను, వివరించారు. సానుకూలంగా స్పందించిన ఆయన తాను కూడా పార్లమెంట్ ఎన్నికల హామీ ఇచ్చినట్టు గుర్తు చేశారు. సీఎం దృష్టికి తీసుకుపోయి, సాధ్యమైనంత తొందరగా రెవెన్యూ డివిజన్ అయ్యే విధంగా చర్యలు తీసుకుంటానని హామీ నిచ్చారు. ఆయనను కలిసిన వారిలో జేఏసీ నాయకులు కొమ్ము నర్సింగరావు, బుట్టి సత్యనారాయణ, అందే బీరయ్య,అందే అశోక్, సన్వాల  ప్రసాద్ తదితరులు ఉన్నారు.

కొమ్మురిని పరామర్శించిన చామల 

జనగామ డీసీసీ అధ్యక్షులు కొమ్మూరి ప్రతాపరెడ్డి  తల్లి సత్తెమ్మ  ఇటీవలఅనారోగ్యంతో మృతి చెందింది. విషయం తెలుసుకున్న భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కొమ్మూరి  స్వగ్రామమైన నర్సాయి పల్లి గ్రామానికి వెళ్లి ఆయనను పరామర్శించారు. ఆయన వెంట సిద్దిపేట జిల్లా డిసిసి అధ్యక్షులు నర్సారెడ్డి నాయకులు మడుపు భూమిరెడ్డి, మాజీ జెడ్పిటిసిలు గిరి కొండల్ రెడ్డి, కొమ్ము నరసింహ రావు, మాజీ సర్పంచ్ చెరుకురమణారెడ్డి తదితరులు ఉన్నారు.

 కొమ్మూరిని పరామర్శించిన పల్లా 

 కొమ్మూరి ప్రతాపరెడ్డి తల్లి ఇటీవల మృతి  చెందిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి పరామర్శించారు. ఆయన వెంట తాజా మాజీ ఎంపీపీ బద్దిపడగ కృష్ణారెడ్డి, నాయకులు మేక సంతోష్