calender_icon.png 31 January, 2025 | 7:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా

27-01-2025 12:23:57 AM

మున్సిపల్ కౌన్సిలర్ కారుపాకుల సువర్ణ

పెబ్బేరు, జనవరి 26: ప్రజా సమస్యల కోసం నిరంతరంగా కృషి చేస్తానని మున్సిపల్ కౌన్సిలర్ కారుపాకుల సువర్ణ వెంకట్ రాములు యాదవ్ అన్నారు. పెబ్బేరు మున్సిపాలిటీ 4వ వార్డులోని వినాయక నగర్ లో నూతనంగా నిర్మించిన మినీ వాటర్ ట్యాంక్, బోరు మోటార్ ను కాలనీ వాసులతో కలిసి ఆమె ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ కాలనీలో వాటర్ కోసం ప్రజలు ఇబ్బంది పడుతూ ఉండేవారన్నారు.

కాలనీ ప్రజల శాశ్వత పరిష్కారం కోసం బోర్ మోటార్, మినీ వాటర్ ట్యాంక్ నిర్మాణం చేపట్టామని చెప్పారు. కాలనీ ప్రజలకు అన్ని వేళలలో నీరు అందేలా మినీ వాటర్ ట్యాంక్ ఎంతో దోహదపడుతుందన్నారు. దీంతో కాలనీ ప్రజల చిరకాల వాటర్ సమస్య తీరనుందని పేర్కొన్నారు. సమస్యలను పరిష్కరించేందుకు ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పెబ్బేరు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కారుపాకుల వెంకట్ రాములు యాదవ్, సింగిల్ విండో డైరెక్టర్ నాగిరెడ్డి, కాలనీ మహిళలు పద్మావతి, సరళ, సంధ్య, జానంపేట లక్ష్మీకాంతరెడ్డి, జానంపేట వెంకట్ రెడ్డి, నాగసానిపల్లి వెంకటరెడ్డి, జానంపేట శ్రీరామ్ రెడ్డి, గుర్రంగడ్డ రాజు రెడ్డి, శివ, దేవేందర్ రెడ్డి, నరేందర్ రెడ్డి, రామచంద్రయ్య, సంబుల వెంకటేష్, అయ్యస్వామి, విజయ్, మధు, నరేందర్ రెడ్డి, నరేష్, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.