19-04-2025 11:26:01 PM
తెలంగాణ ఉద్యోగుల జాక్ కో- చైర్మన్...
నిజామాబాద్ (విజయక్రాంతి): తెలంగాణ ఉద్యోగులు, గెజిటెడ్ అధికారుల, ఉపాధ్యాయుల, కార్మిక, పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని జిల్లా జాయింట్ యాక్షన్ కమిటీ కో- చైర్మన్ శ్రీ నర్సయ్య అన్నారు. శనివారం జిల్లా ఇంటర్ విద్య అధికారి కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో నర్సయ్య మాట్లాడారు. గజిటేడ్ అధికారుల, ఉపాధ్యాయుల, కార్మిక, పెన్షనర్ల తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ నిజామాబాద్ జిల్లా కో - చైర్మన్ గా జిల్లా ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం అధ్యక్షులు శ్రీ నర్సయ్య ఎంపికైన సందర్భంగా శనివారం నాడు జిల్లా ఇంటర్ విద్య అధికారి కార్యాలయంలో సమావేశం జరిగింది.
జిల్లా ఇంటర్ విద్య అధికారి శ్రీ రవికుమార్ తో పాటు ప్రిన్సిపాల్ ల సంఘం అధ్యక్షులు చిన్నయ్య, ఉపాధ్యక్షులు బుద్ధిరాజ్, ప్రధాన కార్యదర్శి చంద్ర విఠల్, శ్రీనాథ్, రజియుద్ధిన్ అస్లాం, నారాయణ, ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం ఉపాధ్యక్షులు జాఫర్, ప్రధాన కార్యదర్శి నారాయణలు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు సురేష్ బాబు, రవి, ప్రకాష్, తులసీదాస్, శంకర్ లు పాల్గొన్నారు.