సమగ్ర శిక్ష ఉద్యోగులతో ఎమ్మెల్సీ కోదండరాం
భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 3 (విజయక్రాంతి): సమగ్ర శిక్ష ఉద్యోగులు చేసేది న్యాయ పోరాటం అని, వారి న్యాయమైన డిమాండ్ల సాధ నకు, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. శుక్రవారం కొత్తగూడెంలో గత 25రోజులుగా సమ్మె చేస్తున్న ఉద్యోగులకు ఆయన సంఘీభావం తెలిపి, మాట్లాడారు.
ముఖ్యమంత్రి, డిప్యూటీ సీ వద్దకు సమస్యను తీసుకెళ్లి పరిష్కరించే దిశగా ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. అందుకు ప్రభుత్వానికి కొద్ది నెల పడుతుందని చెప్పారు. కాగా జిల్లాలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పర్యటన నేపథ్యంలో సమగ్ర శిక్ష ఉద్యోగులు కలిసి వినతిపత్రం అందజేశారు.
కార్యక్రమంలో సమగ్రశిక్ష ఉద్యోగుల సంఘం అధ్యక్ష, ప్రధా కార్యదర్శులు మోహన్, చందు, మహిళా అధ్యక్షురాలు ఎం తులసి, కార్యనిర్వాహక అధ్యక్షులు సిద్ధయ్య, పద్మజ, పార్వతి తదితరులు పాల్గొన్నారు.