calender_icon.png 26 February, 2025 | 7:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమస్యల పరిష్కారాన్ని కృషి చేస్తా..

01-12-2024 07:02:45 PM

కవాడిగూడ కార్పొరేటర్ గోడ్చల రచన శ్రీ

ముషీరాబాద్ (విజయక్రాంతి): డివిజన్ లో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తానని కవాడిగూడ డివిజన్ కార్పొరేటర్ గోడ్చల రచన శ్రీ అన్నారు. ఈ మేరకు ఆదివారం డివిజన్ లోని ఎల్ఐసి కాలనీలో సమస్యలపై ఆమె సందర్శించి పరిశీలించారు. కాలనీలో నెలకొన్న సమస్యలను స్థానిక ప్రజలను అడిగి తెలుసున్నారు. ఎల్ఐసి కాలనీలో పార్కులో బోరింగు చెడిపోయినా గత మూడు నెలల నుండి పట్టించుకోవడం లేదని, శానిటైజర్ సరిగా చేయడం లేదని, రిటర్నింగ్ వాళ్లపై చెట్టు కొమ్మ విరిగి పడిపోయిందని, వీధి కుక్కల బెడత సమస్యలను తీర్చాలని కార్పొరేటర్ కు స్థానికులు విన్నవించారు. సందర్భంగా సానుకూలంగా స్పందించిన కార్పొరేటర్ మాట్లాడుతూ.. సమస్యలను తీరుస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎల్ఐసి అధ్యక్షుడు కుమార్, కార్యదర్శి రాకేష్, రాఘవ, విశాల్, బిజెపి సీనియర్ నాయకుడు జి. వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.