calender_icon.png 20 January, 2025 | 9:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పట్టణాభివృద్ధికి అవిశ్రాంతంగా కృషి చేస్తా

20-01-2025 05:52:15 PM

వారం వ్యవధిలోనే రూ.8.37 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం 

కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు...

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): కొత్తగూడెం పట్టణ సమగ్రాభివృద్ధికి, ప్రజలకు కనీస మౌలిక వసతుల కల్పనకు అవిశ్రాంతంగా కృషి చేస్తానని కొత్తగూడెం నియోజకవర్గ శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు(MLA Koonamneni Sambasivarao) అన్నారు. కొత్తగూడెం మున్సిపాలిటీలోని పది వార్డుల్లో రూ.4.42కోట్ల డిఎంఎఫ్ నిధులతో చేపట్టనున్న 31 అభివృద్ధి పనులకు సోమవారం ఎమ్మెల్యే కూనంనేని శంకుస్థాపన చేశారు. శంకుస్థాపనల అనంతరం ఏర్పాటు చేసిన సభల్లో అయన మాట్లాడారు. ఈ నెల 26న మున్సిపల్ పాలకవర్గం పాలనాకాలం ముగుస్తుండటంతో వారి సేవలకు గుర్తింపు తెచ్చేందుకు ముమ్మరంగా శంకుస్థాపన కార్యక్రమాలు చేపడుతున్నామని, వారం రోజుల వ్యవధిలోనే కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలో రూ.8.37కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నామని తెలిపారు. అంతర్గత రోడ్లు, డ్రైన్లు, వార్డు ప్రధాన రహదారులు, కమ్యూనిటీ హాళ్లు, అంగన్వాడీ కేంద్రాలకు పక్కా భవనాలు, ఎంపవర్మెంట్ సెంటర్లు, కమ్యూనిటీ హాళ్లు నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు.

పట్టణంలో త్రాగునీటి సమస్యకు శాశ్వత పరిస్కారం చూపేందుకు, ప్రధాన రహాదారిలో పార్కింగ్ స్థలాల, సెంట్రల్ లైటింగ్, సిసి కెమెరాల ఏర్పాటపై చర్యలు చేపట్టామని, త్వరలో నగరంగా ఆవిష్కరించబడుతున్న కొత్తగూడెంను అభివృద్ధి, సౌకర్యాల కల్పనలో ప్రధాన నగరాల సరసన చేరుస్తామన్నారు. శంకుస్థాపన పూర్తయిన అభివృద్ధి పనులను నాణ్యతగా చేపట్టేందుకు అధికారులు నిత్యం పర్యవేక్షించాలని, ఎలాంటి అవినీతి జరిగిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమాల్లో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి, తహసీల్దార్ పుల్లయ్య, మున్సిపల్ కమిషనర్ శేషాంజన్ స్వామి, డీఈ రవికుమార్, కౌన్సిలర్లు కంచర్ల జమలయ్య, బోయిన విజయకుమార్, అనిల్, పరమేష్ యాదవ్, లక్ష్మణ్, నేరెళ్ల సమైక్య, కోలాపూరి ధర్మరాజు, కె సుజాత, భీమా శ్రీవల్లి, బండి నర్సింహారావు, దుర్గ, భూక్యా శ్రీనివాస్, సలిగంటి శ్రీనివాస్, జి వీరాస్వామి, కందుల భాస్కర్, మునిగడప వెంకటేశ్వర్ రావు, పిడుగు శ్రీనివాస్, ముడెత్తుల శ్రీనివాస్, విజయ్, పద్మ, నిమ్మగడ్డ వెంకటేశ్వరరావు, యూసుఫ్, ఫహీమ్, సుధాకర్, జహీర్, వుల్లోజు వెంకట్, పాటి మోహన్ తదితరులు పాల్గొన్నారు.