calender_icon.png 8 February, 2025 | 5:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజల కోసం పనిచేస్తా

08-02-2025 12:00:00 AM

  1. పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ 
  2. ఎల్బీనగర్ నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన 

ఎల్బీనగర్, ఫిబ్రవరి 7 : బీఆర్‌ఎస్ పాలనలో ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అయన అనుచరులు అధికారులతో కుమ్మక్కై చెరువులు, కుంటలు, అసైన్డ్ స్థలాలను కబ్జా చేశారని పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ ఆరోపించారు. అంతేకాకుండా అక్రమ నిర్మాణాలు, అనుమతులు లేకుండా సెల్లార్లతో భారీ నిర్మాణాలను ప్రోత్సహించారని విమర్శిం చారు.

అధికారులు ఇప్పటికీ గత ప్రభుత్వ నేతల మాటలే వింటూ అక్రమాలను ప్రోత్సహిస్తున్నారని, అలాంటి వారిపై కఠినంగా చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలోని పలు కాలనీల్లో శుక్రవారం మధుయాష్కీ గౌడ్ పర్యటించి, సమస్యలను తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారీ నిర్మాణాలతో సెల్లార్ల గుంతలు తీసి సామాన్యుల ప్రాణాలను తీస్తున్నారని, ఇందుకు ఎల్బీనగర్లో రెండు రోజుల కింద జరిగిన సెల్లార్  కూలి ముగ్గురు మరణించిన ఘటనే నిదర్శమన్నారు.

అక్రమ నిర్మాణాలపై కఠినంగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు. పదవిలో ఉన్నా లేకున్నా ప్రజల కోసం పని చేస్తానని, ఎల్బీనగర్ నియోజక వర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. 

చంపాపేట డివిజన్‌లో..

చంపాపేట డివిజన్ లోని ఉదయ్ నగర్ కాలనీలో మధు యాష్కీ గౌడ్ పర్యటించారు. వరద నీటి నాలా పనులు అసంపూర్తిగా ఉండడంతో ఇబ్బంది పడుతున్నామని స్థానికులు తెలిపారు. ప్రత్యక్షంగా నాలాను పరిశీలించిన మధుయాష్కీగౌడ్ వెంటనే ఎస్ ఎన్ డీపీ  డీఈతో ఫోన్ లో మాట్లాడి వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేసి, నాలా నిర్మాణ పనులు పూర్తి చేయాలని సూచించారు.

అదేవిధంగా కాలనీలోని ఖాళీ ప్రదేశంలో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పడంతో సరూర్ నగర్ ఇన్ స్పెక్టర్ తో మాట్లాడి పెట్రోలింగ్ గస్తీ పెంచి ఆకతాయిలపై కఠినంగా వ్యవహరించాలని సూచించారు. 

వనస్థలిపురం డివిజన్ పరిధిలో...

వనస్థలిపురం డివిజన్ కార్పొరేటర్ రాగుల వెంకటేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో డివిజన్లోని మల్లికార్జున నగర్ కాలనీలో ఏర్పాటు చేసిన సమావేశంలో మధుయాష్కీ పాల్గొన్నారు. మల్లికార్జున నగర్ కాలనీలో పార్కు అభివృద్ధికి, సీసీ రోడ్లు, కమ్యూనిటీ మా హాల్ నిర్మాణానికి నిధులు మంజూరు చేసేలా చూడాలని, ఇందిరమ్మ, ఇల్లు రేషన్ కార్డులు ఇప్పించాలని కాలనీవాసులు కోరారు. 

అర్హులు అందరికీ ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు ఇప్పిస్తామని పేర్కొన్నారు. అనంతరం క్రిస్టియన్ కాలనీలో జరుగుతున్న నాలా నిర్మాణ పనులను పరిశీలించారు. వెంకటరమణ కాలనీలోనూ పర్యటించి సమస్యలు తెలుసుకున్నారు. కార్పొరేటర్ వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. మధు యాష్కీగౌడ్ సహకారంతోనే పార్కు అభివృద్ధి, డ్రైనేజీ, రోడ్డు పనులకు నిధులు మంజూరు అయ్యాయన్నారు. 

వనస్థలిపురంలోని గ్రంథాలయ పరిశీలన

వనస్థలిపురంలోని శాఖా గ్రంథాలయాన్ని మధుయాష్కీ సందర్శించారు. ఇప్పటికే రూ. 1.50 కోట్ల నిధులు మంజూరు అయినప్పటికీ కొందరు పనులు ప్రారంభించకుండా అడ్డుకుంటున్నారని స్థానికులు ఆరోపించారు. స్పందించిన మధుయాష్కీ.. త్వరలోనే మంత్రి శ్రీధర్ బాబుతో శంకుస్థాపన చేయిస్తానన్నారు.

అంతేకాకుండా శాఖా గ్రంథాలయం, ఎన్జీవోస్ కాలనీ హౌసింగ్ సొసైటీ, ఎన్జీవోస్ కాలనీ సంక్షేమ సంఘం,  రంగ స్థల కళాకారుల అభిమాన సమాఖ్య, విశ్రాంత ఉద్యోగుల సంఘం ప్రతినిధులు అందరూ కలిశారు. ఎక్కడెక్కడ  భవనాలు నిర్మించాలో? ఏకాభిప్రాయంతో నిర్ణయం తీసుకోవాలని సూచించారు.

వారు తీసుకునే నిర్ణయంతో ఆయా భవనాలను డిజైన్ చేసి, నిధులు మంజూరు చేయిస్తామని మధుయాష్కీగౌడ్ సూచించారు. కార్యక్రమాలలో కాంగ్రెస్ సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడు మిద్దెల జితేందర్,  కార్పొరేటర్ రాగుల వెంకటేశ్వర్ రెడ్డి, కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షుడు నర్సింహ యాదవ్,  నాయకులు మకుటం సదాశివుడు, శ్రీపాల్ రెడ్డి, వేణుగోపాల్ యాదవ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు పాశం అశోక్ గౌడ్, నేలపాటి రామారావు, బుడ్డా సత్యనారాయణ, నాయకులు బద్రీనాథ్, దుర్గారెడ్డి, సాయి నికేష్, ఓరుగంటి వెంకటేష్, సామామహేశ్వర్ రెడ్డి, సురేందర్,  కిరణ్, కవిత, భాను పాల్గొన్నారు.