నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి...
నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ నియోజకవర్గంలో గ్రామాల అభివృద్దికి ప్రభుత్వం రూ.850 కోట్లతో వివిధ అభివృద్ది పనులు చేపట్టుతున్నట్టు నిర్మల్ ఎమెల్యే మహేశ్వర్ రెడ్డి(MLA Maheshwar Reddy) అన్నారు. బుధవారం లక్ష్మణచాంద మండలంలోని కన్కపూర్, వడ్యాల్, రాచాపూర్, లక్ష్మణచాంద, చామన్ పల్లి మునిపల్లి, మల్లాపూర్ పార్‌పల్లి, పీచర తదితర గ్రామాల్లో పర్యటించి వివిధ అభివృద్ది పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. సీసీ రోడ్డు మురికి కాలువలు, పార్మేషన్ రోడ్లు, ప్రహారి గోడలు ప్రభుత్వ పాఠశాలలో అదనపు తరగతి గదులు తదితర పనులను చేపట్టనున్నట్టు తెలిపారు.
నిర్మల్ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ప్రజలకు మౌళిక సదుపాయాలు కల్పించడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయాలని కోరారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్రామ సభల్లో పెద్ద ఎత్తున ప్రజలు ప్రభుత్వ పథకాల కోసం దరఖాస్తు చేసుకొంటే వాటిని పరిగణలోకి తీసుకొని ప్రతి పేద కుటుంబానిక న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యాక్రమంలో నాయకులు పద్మరమేష్, రావుల రాంనాథ్, భూపాల్ రెడ్డి తదితరులు ఉన్నారు.