18-04-2025 12:00:00 AM
వార్షికోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే పాయల్ శంకర్
ఆదిలాబాద్, ఏప్రిల్ 17 (విజయ క్రాంతి) : కళాశాలతో పాటు విద్యారంగ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ఆదిలాబాద్ లోని ప్రభుత్వ డిగ్రీ సైన్సెస్ కళాశాలలో క్రీడా సాంస్కృతిక వార్షికోత్సవం ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు ఎమ్మెల్యే బహుమతులు అందజేశారు.
విద్యార్థులు ఉన్నత స్థానాల కు చేరుకోవడానికి నిరంతర ప్రయత్నం చేయాలని ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ సంగీత ఇచ్చోడ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆచ్చి శ్రీనివాస్, వైస్ ప్రిన్సిపాల్ కెప్టెన్ జగ్రామ్ అంత ర్వేది, అకడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ అరుణ్ కుమార్ సాంస్కృతిక సమన్వయకర్త సంతో ష్ కుమార్, అధ్యాపకులు శ్రావణి, జ్యోత్స్న రమాకాంత్ గౌడ్, చక్రవర్తి, మంజుల, అష్రఫ్ అలీ, రాజ్ కుమార్ పాల్గొన్నారు.