calender_icon.png 3 March, 2025 | 9:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పురాతన దేవస్థాన అభివృద్ధికి కృషి చేస్తా

03-03-2025 12:36:23 PM

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

చిట్యాల,(విజయ క్రాంతి): కాకతీయుల కాలంలో నిర్మించిన పురాతన దేవస్థాన అభివృద్ధికి, తన వంతు కృషి చేస్తానని భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు(MLA Gandra Satyanarayana Rao) అన్నారు. సోమవారం మండలంలోని ఓడితల గ్రామంలోని శ్రీ వేణుగోపాలస్వామి దేవస్థానం, శ్రీ రామలింగేశ్వరస్వామి దేవస్థానం, బద్ది పోచమ్మ తల్లి దేవాలయాలల్లో ధ్వజ స్తంభాల ప్రతిష్టాపన కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు స్థానిక కాంగ్రెస్ శ్రేణులతో కలిసి హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వేణుగోపాలస్వామి, రామలింగేశ్వరస్వామి, బద్ది పోచమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నారు. ఒడితల గ్రామంలోని కాకతీయుల కాలం నాటి పురాతన ఆలయాలను అభివృద్ది చేసేందుకు తన వంతుగా కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యేకు పలువురు శాలువాలు కప్పి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో చిట్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మడి శ్రీదేవి సత్యనారాయణ, మండల పార్టీ అధ్యక్షుడు గూట్ల తిరుపతి,గడ్డం కొమురయ్య,జిల్లా అధికార ప్రతినిధి దొడ్డికిష్టయ్య, జిల్లా కార్యదర్శి ముకిరాల మధు వంశీకృష్ణ, మాజీ సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు కామిడీ రత్నాకర్ రెడ్డి,మాజీ ఎంపీటీసీ దబ్బేట అనిల్,టౌన్ అధ్యక్షుడు బుర్ర లక్ష్మణ్ గౌడ్, చిలుకల రాజకోమురు, గ్రామస్తులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.