రూ. 3కోట్ల 25 లక్షలతో జూనియర్ కాలేజీ భవనానికి శంకుస్థాపన
గద్వాల, ఫిబ్రవరి 5 (విజయక్రాంతి): ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి సహకారంతో మానవపాడు మండలంలో విద్యాభివృద్ధిలో ప్రథమ స్థానంలో ఉండే విధంగా చూస్తానని ఎమ్మెల్యే విజయుడు పేర్కొన్నారు. బుధవారము మండల కేంద్రంలో కస్తూర్బా గాంధీ బాలికల ఇంటర్ జూనియర్ కాలేజీ భవనంకు ఎమ్మెల్యే విజయుడు , విద్యాశాఖ అధికారులతో కలిసి భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయుడు మాట్లాడు తూ బాలికల విద్యాభివృద్ధి కోసం కస్తూర్బా గాంధీ ఇంటర్ జూనియర్ కాలేజీ భవనంకు మూడు కోట్ల 25 లక్షల రూపాయలు మంజూరు చేయించడం జరిగిందని . పనులు త్వరితగతిన పూర్తిచేసి విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చే విధంగా అధికారులను ఆదేశించారు.
అలంపూర్ నియో జకవర్గం విద్యాభివృద్ధిలో వెనుకబడి ఉన్నదని నియోజకవర్గంలోని ప్రతి మండలంలో విద్యా ర్థుల సౌకర్యార్థము నూతన పాఠశాల భవనాలు హాస్టల్ భవనాలు కస్తూర్బా గాంధీ భవనాలు మంజూరయ్యే విధంగా చూస్తానని ఎమ్మెల్యే పేర్కొన్నారు. విద్యార్థులకు ఉపాధ్యాయులకు ఏ సమస్య ఉన్న తన దృష్టికి తీసుకొని వస్తే పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే అధికా రులకు సూచించారు. అనంతరం కస్తూర్బా గాంధీ హాస్టల్లో విద్యార్థులకు కల్పిస్తున్న విద్యా పై ఆరా తీసి భోజనం మెనూ పాఠశాల పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు.