calender_icon.png 28 March, 2025 | 7:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉద్యోగుల ప్రయోజనాల కోసం కృషి చేస్తా

21-03-2025 12:00:00 AM

  • ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ 
  •  తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం డైరీ ఆవిష్కరణ 

నిజామాబాద్, మార్చి 20 :(విజయ క్రాంతి): ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడేందుకు తన వంతు కృషి చేస్తానని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ భరోసా కల్పించారు. గురువారం నిజామాబాద్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన జిల్లా గెజిటెడ్ ఉద్యోగుల సంఘo 2025 సంవత్సర డైరీని ఆయన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తదితరులతో కలిసి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ, ఆర్థిక ఇబ్బందులు నెలకొని ఉన్నప్పటికీ ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తుందని అన్నారు. ఆర్థికపరమైన వెసులుబాటును బట్టి ఇతర అన్ని సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ఆయన వెల్లడించారు. ఉద్యోగులకు దక్కాల్సిన ప్రయోజనాల గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటిని ఇప్పించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘ భవనానికి ఇప్పటికే స్థలాన్ని కేటాయించడం జరిగిందని, భవన నిర్మాణం కోసం రూ. 20 లక్షల నిధులు కేటాయిస్తున్నట్టు షబ్బీర్ అలీ ప్రకటించారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య ఉద్యోగులు వారధిలా పనిచేయాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయడంలో ఉద్యోగులు చిత్తశుద్ధితో  కృషి చేయాలని అన్నారు.

కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంలో ఉద్యోగుల పాత్ర ముఖ్యమైనదని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను పేదలకు చేరవేసి ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను విజయవంతం చేయడంలో ప్రభుత్వ అధికారులు ఉద్యోగుల కృషి మరువలేనిదని అన్నారు.

ఈ సంధర్భంగా గెజిటెడ్ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు పలు సమస్యలను ప్రస్తావించగా, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని షబ్బీర్ అలీ తెలిపారు. గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఏలూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ,  ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయడంలో ఉద్యోగులు చిత్తశుద్ధితో  కృషి చేస్తున్నారని అన్నారు.

రాష్ట్ర గెజిటెడ్ ఉద్యోగులందరు ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంలో ఎప్పటికప్పుడు సంసిద్దులుగా ఉంటారని, మా ఉద్యోగులందరు కూడా ప్రభుత్వనికి అన్ని వేళల సహ కరిస్తుంటామని,చిత్త శుద్ధితో పనిచేస్తు, ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే  విధంగా కృషి చేస్తున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో నుడా ఛైర్మన్ కేశ వేణు, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, టీజీఓs సెంట్రల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, జిల్లా సంఘం అధ్యక్షుడు అలుక కిషన్, కార్యదర్శి అమృత్ కుమార్, ఆయా శాఖల గెజిటెడ్ అధికారులు పాల్గొన్నారు.  అనంతరం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ టీఎన్జీవో సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు.