03-03-2025 12:57:13 AM
ఎల్బీనగర్, మార్చి 2 : ఎల్బీనగర్ నియోజకవర్గంలో వరద ముంపు సమస్యను పరిష్కరించానని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అన్నారు. లింగోజిగూడ డివిజన్ పరిధిలోని శాతవాహన కాలనీలో సుమారు రూ. 53 లక్షలతో చేపడుతున్న నూతన సీసీరోడ్డు నిర్మాణ పనులకు ఆదివారం ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ... నియోజకవర్గ పరిధిలో ప్రధాన సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తానన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని నిధులు తీసుకొచ్చి నియోజకవర్గ అభివృద్ధి కోసం తనవంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
గతంలో చిన్నపాటి వర్షానికి కాలనీలు జలమయయ్యేవని, నూతన బాక్స్ డ్రైన్స్ వ్యవస్థ నిర్మాణంతో వరద ముంపు సమస్యల నుంచి విముక్తి చేశామన్నారు. కార్యక్రమంలో లింగోజిగూడ కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డి, బీఆర్‌ఎస్ డివిజన్ మాజీ అధ్యక్షుడు తిలక్ రావు, నాయకులు చిత్తలూరి వెంకటేశ్వర్లు, మధు సాగర్, రాజేందర్, మురళి, ఆశిష్, చిత్రం సాయి, కాలనీ వాసులు గోపాల్ రెడ్డి, శ్రీపతి రావు, అశోక్ గౌడ్, రవి కుమార్, జగదీశ్ రెడ్డి, కృష్ణ ప్రసాద్, రాఘవేందర్ రాజు, వెంకట్ రమణచారి తదితరులు పాల్గొన్నారు.