calender_icon.png 4 February, 2025 | 10:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్సీగా గెలిచి సోనియాగాంధీకి గిఫ్ట్ ఇస్తా

03-02-2025 12:00:00 AM

పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి  

కరీంనగర్, ఫిబ్రవరి 2 (విజయ క్రాంతి):  రానున్న పట్టభద్రుల ఎన్నికల్లో తాను ఎమ్మె ల్సీగా గెలిచి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ రాష్ర్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి గిఫ్ట్ గా ఇస్తానని పట్టభద్రులు ఎమ్మె ల్సీ కాంగ్రెస్ అభ్యర్థి,  అల్ఫోర్స్ విద్యా సంస్థ ల అధినేత  డాక్టర్ వి నరేందర్ రెడ్డి స్పష్టం చేశారు. 

ఆదివారం కరీంనగర్ జిల్లా కేంద్రం లోని క్యాంపు కార్యాలయంలో ఆయన విలే కరుల సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తనపై నమ్మకం ఉంచి పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన అభ్యర్థిత్వాన్ని ఖరా రు చేసిందని,  తనకు సహకరించిన ఢిల్లీ పెద్దలకు, రాష్ర్ట నాయకత్వానికి రుణపడి ఉం టానని వెల్లడించారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు మరో 23 రోజులే మిగిలి ఉన్నందున ప్రతి కాంగ్రెస్ కార్యకర్తతో మమేకమై ముందుకు సాగుతానని తెలిపారు.

ఎమ్మెల్సీ ఎన్నికలు ఉత్తర తెలంగాణ చరిత్రను మార్చే విధంగా ఉండాలని, ప్రతి కాంగ్రెస్ కార్యకర్త తన గెలుపులో పాలుపంచుకోవాలని కోరారు. సీఎం రేవంత్ రెడ్డి, టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఈ ఎమ్మెల్సీ ఎన్నికను ప్రతి ష్టాత్మకంగా తీసుకున్నారని, తాను విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు.  గత 34 సంవత్సరాలుగా తాను విద్యారంగంలో రాణించానో ఏడాది కాలంలో సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్నారని పేర్కొన్నారు.

ఉత్తర తెలంగా ణలో కరీంనగర్ ను అన్ని రంగాల్లో అభివద్ధి చేసేందుకు కషి చేస్తానని, ప్రభుత్వం మెడిక ల్ కళాశాల మంజూరు చేసిందని మౌలిక సదుపాయాలు మాత్రం మరిచిపోయిందని ఎద్దేవా చేశారు. గత ఐదు నెలలుగా ఎమ్మె ల్సీ పరిధిలోని 42 నియోజకవర్గాలు పర్య టించానని, సమస్యలు తన దష్టికి వచ్చా యని, పట్టభద్రుల సమస్యలు పరిష్కరిం చేందుకు తాను ఎల్లవేళలా ముందుంటానని పేర్కొన్నారు..

కాంగ్రెస్ అధికారం లోకి వచ్చిన ఏడాదిలోనే 55000 ఉద్యోగాలు ఇచ్చి యువతకు భరోసా కల్పించిందని గుర్తు చేశారు. కరీంనగర్ శాతవాహన యూ నివర్సిటీ పరిధిలో లా కాలేజ్ తోపాటు ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల మంజూరు చేస్తానని ప్రభుత్వం ప్రకటించడం ఆనం దంగా ఉందని అన్నారు.

ప్రభుత్వం ప్రకటిం చిన జాబ్ క్యాలెండర్ అమలుకు కషి చేస్తాన ని అన్నారు. ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకార భాస్కర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్,  మాజీ కార్పొ రేటర్లు చాడగొండ బుచ్చిరెడ్డి, కాశిరెడ్డి శ్రీని వాస్, శ్రావణ్ నాయక్,  మునిగంటి అనిల్, ఫహాద్, గండి రవీందర్,   వెన్నం రజిత రెడ్డి, షబానా, శరణ్య, తదితరులు పాల్గొన్నారు.