calender_icon.png 8 November, 2024 | 12:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వినేశ్‌కు ఊరట కలిగేనా!

10-08-2024 04:02:07 AM

ఒలింపిక్స్ ముగిసే లోపు తీర్పునిస్తామన్న కోర్టు

పారిస్: ప్రతిష్ఠాత్మక పారిస్ ఒలింపిక్స్‌లో వినేశ్ ఫొగాట్ ఫైనల్‌కు ముందు కేవలం వంద గ్రాములు అధిక బరువు ఉందన్న కారణంతో ఆమెపై అనర్హత వేటు పడిన సంగతి తెలిసిందే. కాగా అనర్హతను సవాల్ చేస్తూ వినేశ్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (కాస్)ను ఆశ్రయించింది. తాజాగా శుక్రవారం కాస్ వినేశ్ కేసులో విచారణ చేపట్టింది. వినేశ్ ఫొగాట్  కేసుకు సంబం ధించిన తీర్పును ఒలింపిక్స్ ముగిసేలోపు (ఆగస్టు 11) వెలువరించనున్నట్లు కాస్ పేర్కొంది. ఇందుకు సంబంధించి ఉత్తర్వులు కూడా జారీ చేసింది. వినేశ్ అత్యవసరంగా విచారించమని ఎక్కడా కోరలేదని కోర్టు పేర్కొంది.

కేవలం తనకు రజతం ఇవ్వాలని మాత్రమే పిటిషన్‌లో పేర్కొంది. కాగా అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ చీఫ్ వినేశ్‌కు రజతం ఇచ్చేందుకు సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. రెండు రజత పతకాలు ఇవ్వడం సాధ్యం అయ్యే పని కాదని చీఫ్ థామస్ తెలిపారు. ఇక వినేశ్ తరఫున భారత సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే వాదనలు వినిపించారు. వాదనల సందర్భంగా తాను ఎటువంటి మోసపూరిత నేరానికి పాల్పడలేదని కోర్టుకు వినేశ్ విన్నవించుకున్నారు. బరువు అనేది శరీరానికి సంబంధించిన సహజ విషయం అని, ముందు రోజు వరకు ఆమె శరీర బరువు ప్రమాణాలకు తగ్గట్లే ఉందని హరీష్ సాల్వే వాదించారు.