27-04-2025 12:47:13 AM
హైదరాబాద్, ఏప్రిల్ 26 (విజయక్రాంతి ): తన వాక్ఫటిమతో తెలంగాణ ప్రజలను ఉర్రూతలూగించే వక్తల్లో కేసీఆర్ ముందు వరుసలో ఉంటారనడంలో సందేహం లే దు. ఉద్యమ సమయంలో ఆయన స్పీచులకు ఫిదా కానీవారుండరు. గత అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య ఓటమి తర్వాత 15 నెలలుగా ఆయన అడపాదడపా మినహా పెద్దగా బయటకు వచ్చిన దాఖలాలు లేవు.
ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్ తన జవసత్వాలు కూడా గట్టుకొని ప్రజల్లోకి వెళ్లాల్సిన అనివార్యత ఏర్పడింది. దీంతో ఏప్రిల్ 27న ఎల్కతుర్తిలో జరిగే పార్టీ రజతోత్సవ సభలో గులాబీ దళపతి కేసీఆర్ స్పీచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడతారా? క్యాడర్‌లో జోష్ నింపుతారా? అని సర్వత్రా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇప్పటికే తెలంగాణలో వెలుగుచూస్తున్న అనేక ప్రజా సమస్యలపై క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వంతో ఢీకొడుతున్న కారు పార్టీ అగ్రనేతలు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. పార్టీ ఏర్పడి 25 ఏళ్లయిన సందర్భం గా రజతోత్సవ సభను గులాబీ పార్టీ నిర్వహిస్తోంది. అధికారం కోల్పోయిన తర్వాత ఇటీవల కాలంలో అడపాదడపా ప్రజల్లోకి రావడం మినహా కేసీఆర్ ఎర్రవల్లి వ్యవసా య క్షేత్రానికే పరిమితమయ్యారు.
దీంతో కేసీఆర్ వరంగల్ ఎల్కతుర్తి సభను ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని నిర్వహిస్తున్నారు. దీనితో సుదీర్ఘ కాలం తర్వాత కేసీఆర్ ప్రసంగించబోతున్నారు. ఆయన ఏం మాట్లా డుతారు? అనే ఉత్కంఠ ఇటు పార్టీ శ్రేణుల్లో నూ, అటు రాజకీయవర్గాల్లోనూ నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల ఓటమి, లోక్‌సభ ఎన్నికల్లో సున్నా సీట్లు రావడం, ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకపోవడం వంటి అంశాలతో క్యాడర్‌లో నిస్తేజం నెలకొంది.
దీన్ని దూరం చేసేలా గులాబీ బాస్ స్పీచ్ ఉంటుందని ప్రధానంగా చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని అంశాలు వివాదస్పదం కాగా, మరికొన్ని అంశాలు చర్చనీయాంశమయ్యా యి. లగచర్ల అంశంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ రిపోర్ట్ ఇవ్వడం, సుంకిశాలలో సైడ్ వాల్ కూలిపోవడం, హైడ్రా కూల్చివేతలు, గురుకుల విద్యాలయాల్లో ఫు డ్ పాయిజనింగ్, రైతులు ఆత్మహత్యలు,
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ కూలిపోవడం అంశాలపై కా రు పార్టీ నేతలు పోరాడారు. వాటిని క్షేత్రస్థాయిలో నిలదీయడంతో పాటు సోషల్ మీడియాలో ఈ అంశాలపై విస్తృతంగా పార్టీ వాణిని వినిపించారు. వీటిపై కేసీఆర్ ఏం మాట్లాడుతారా అనే అంశం కూడా ఆసక్తి నెలకొంది.