08-04-2025 01:32:25 AM
టీచర్లకు అన్యాయం జరగనివ్వను: మమత
కోల్‌కతా, ఏప్రిల్ 7: టీచర్లకు మద్దతుగా నిలిచి పోరాడుతున్నందుకు తనను జైల్లో వేస్తారేమో అని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. ఇటీవల సుప్రీం తీర్పుతో ఉద్యోగా లు కోల్పోయిన టీచర్లతో సోమవా రం కోల్‌కతాలోని నేతాజీ ఇండోర్ స్టేడియంలో దీదీ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘మేము ఆ తీర్పును ఒప్పుకున్నట్టు అనుకోకండి.
మేము బండరాళ్లం కాదు.. ఇలా మాట్లాడుతున్నందుకు నన్ను జైలులో పెట్టే అవకాశం కూడా ఉంది. కానీ అవేమీ నేను పట్టించుకోను. అర్హులు ఉద్యోగాలు కోల్పోవడాన్ని నేను భరించలేను. నేను ప్రాణాలతో ఉన్నంత వరకూ కొలువులు కాపాడుతాను’ అని పేర్కొన్నారు.
పశ్చిమ బెంగాల్‌లోని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో పని చేస్తున్న 25,753 మందిని సుప్రీం కోర్టు అనర్హులుగా ప్రకటించింది. కొంత మం ది దివ్యాంగులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఈ తొలగింపు నుంచి సుప్రీంకోర్టు మినహాయింపునిచ్చింది. గతంలో హైకోర్టు కూడా ఇలాంటి తీర్పునే వెలువరించింది.