calender_icon.png 1 October, 2024 | 2:07 AM

సర్వేతో సరిపెడుతారా.. కూల్చుతారా?

30-09-2024 01:28:46 AM

సూర్యాపేటలో ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌ల సర్వే 

2వేలకు పైగా అక్రమ నిర్మాణాలు

కూల్చుతారేమోనని బాధితుల భయం

అనుమతులు ఎందుకిచ్చారంటూ ప్రశ్నలు

సూర్యాపేట, సెప్టెంబర్ 29 (విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఉన్న చెరువుల ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లతో పాటు నాలాలపై చేపట్టిన నిర్మాణాలపై సర్వే చేపట్టడంతో పేట ప్రజల్లో గబులు మొదలైంది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సర్వే మాత్రమే చేస్తున్నామని సిబ్బంది చెబుతున్నప్పటికీ హైడ్రా పరిణామాల నేపథ్యంలో ఆందోళన చెందుతున్నారు.

సూర్యాపేటలోనూ ఇళ్లను కూల్చుతారేమోనని కొందరు భయపడుతున్నారు. అయితే గత 50 ఏండ్ల నుంచి నివాసం ఉంటున్నామని, మున్సిపాలిటీ నుంచి అన్ని రకాల అనుమతులు తీసుకున్నాకే నిర్మాణాలు చేపట్టామని ఇప్పుడు అక్రమ నిర్మాణాలంటూ సర్వే చేయడం సరికాదని కొందరు అంటున్నారు.

సూర్యాపేటలో ప్రధాన చెరువులు

సూర్యాపేట జిల్లా కేంద్రంలో మినీ ట్యాం క్‌బండ్‌గా అభివృద్ధి చెందిన చౌదరి చెరువు (సద్దల చెరువు), మరో మినీ ట్యాంక్‌బ్యాండ్ ని ర్మాణం కోసం అనుమతులు జారీ అయిన పు ల్లారెడ్డి చెరువు, నల్లా చెరువు ఉన్నాయి. రె  వె న్యూ రికార్డుల ప్రకారం బేచిరాగ్ మాదా రం పరిధిలోని వివిధ సర్వే నంబర్లలో చెరు వు భూములు, పరిసర ప్రాంతాలు ఉన్నా యి.

ఇ ందులో 247 సర్వే నంబర్‌లో 115 ఎ కరాల విస్తీర్ణంలో సద్దల చెరువు ఉండాలి. ప్ర స్తుతం దాని విస్తీర్ణం 80 ఎకరాలు మాత్రమే అని తె లుస్తోంది. పుల్లారెడ్డి చెరువు, నల్ల చె రువులు సగానికి పైగానే కబ్జా అయినట్టు తె లుస్తున్నది. ఈ చెరువుల ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లతో పా టు నాలాల పరిధిలోని నిర్మాణాలపై రెవెన్యూ , మున్సిపల్ అధికారులు సర్వే చేస్తున్నారు. 

2 వేలకు పైగా నివాసాలు

సద్దల చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లలో సుమారు 2 వేలకు పైగా ఇండ్లు ఉన్నట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. దాదాపు 50 ఏండ్ల నుంచి ఉంటున్న వారు కొందరు కాగా.. ఇటీవల స్థలం కొని నివాసం ఉంటున్న వారు కొందరు ఉన్నారు. కొన్ని ప్రాంతాల్లో పెద్దపెద్ద భవనాలు సైతం వెలిశాయి.

అయితే వీటి నిర్మాణాలకు 90 శాతానికి పైగా మున్సిపాలిటీ నుంచి అనుమతులు ఉన్నట్టు బాధితులు తెలుపుతున్నారు. సర్వే చేసి అక్రమ నిర్మాణాలు అని అనడం సబబు కాదంటున్నారు. సర్వేల పేరుతో వేదింపులకు పాల్పడవద్దని, వెంటనే సర్వే నిలిపి వేయాలని కోరుతున్నారు. 

మార్కింగ్ చేస్తున్న అధికారులు

జిల్లా కేంద్రంలో ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్‌లు 13, 14, 28, 29, 40, 41, 42, 43 వార్డుల పరిధిలో ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. ఈ వార్డుల పరిధిలో సద్దల చెరువు కట్ట కింది ప్రాంతాలైనా ఇందిరానగర్, శ్రీశ్రీ నగర్, నెహ్రునగర్, మందుల బజార్, నిర్మల హాస్పటల్ వెనుక ప్రాంతాలు ఉన్నాయి. సద్దల చెరువు నాలా వైపు హైమా నగర్, హైటెక్ బస్టాండ్, కింది భాగంలో జేజే నగర్, తాళ్లగడ్డ, పైభాగంలో జనగాం ఎక్స్ రోడ్డు ప్రాంతాలు ఉన్నాయి.

సద్దల చెరువు పరిధిలో అధికారులు సర్వే చేస్తూ మార్కింగ్ వేస్తున్నారు. నల్లచెరువు, పుల్లారెడ్డి చెరువు పరిధిలోని నిర్మాణాలను కూడా గుర్తిస్తున్నట్టు సమాచారం.