calender_icon.png 30 September, 2024 | 2:53 AM

వైద్యాధికారి ఉంటారో.. వెళ్తారో?

29-09-2024 12:21:04 AM

కామారెడ్డి వైద్యశాఖలో గూడు పుఠాణి?

నిలదొక్కుకోలేకపోతున్న జిల్లా వైద్యాధికారులు

మూడేళ్లుగా పాతుకుపోయిన ఇన్‌చార్జి

కామారెడ్డి, సెప్టెంబర్ 28 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా వైద్యాశాఖ కార్యాల యంలో పనిచేసే కొంతమంది ఉద్యోగులు గూడు పుఠాణిగా మారి, జిల్లా వైద్యాధికారి గా వచ్చిన వారిపై ఏవేవో ఆరోపణలు చేస్తూ ఇక్కడి నుంచి వెళ్లేలా చేస్తున్నారు. కామారెడ్డి జిల్లాగా మారినప్పటి నుంచి ఒక్క జిల్లా వై ద్యాధికారి కూడా రెండు సంవత్సరాలకు మి ంచి పనిచేయలేదు.

ఏడాది క్రితం కామారెడ్డికి బదిలీపై వచ్చిన జిల్లా వైద్యాధికారి పద్మ వారం రోజులు కూడా పనిచేయకుండానే సె లవుపై వెళ్లారు. ఐదు రోజుల క్రితం సెలవు లు అయిపోవడంతో విధుల్లో చేరేందుకు వ చ్చారు.

మళ్లీ లీవ్ పెట్టేందుకు ప్రయత్నించ గా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మాత్రం ఉంటే విధుల్లో ఉండండి, లేకుంటే బదిలీపై వెళ్లండి అని కరాఖండిగా చెప్పినట్టు తెలిసింది. దీంతో ఆమె ఐదు రోజుల గడువు కోరినట్లు సమాచారం. సోమవారం విధుల్లో చేరుతారో లేదంటే బదిలీపై వెళ్తారో తేలనుంది.

 గత అధికారులపై ఆరోపణలు

కామారెడ్డి జిల్లా వైద్యాధికారులుగా వచ్చి న కల్పన కాంటే, మరో అధికారిపై వైద్యాశా ఖ ఉద్యోగులు పలు నిందలు మోపి పంపి ంచి వేశారు. ఇటీవల ఇన్‌చార్జి వైద్యాధికారి గా పనిచేసిన లక్ష్మణ్‌సింగ్ ఉద్యోగుల మాట లు వినకపోవడంతో అతడిపై లైంగిక వేధింపుల కేసును పెట్టించారనే ఆరోపణలు విని పిస్తున్నాయి.

ఉద్యోగులు, పీవోలు కుమ్మకై జిల్లా వైద్యాధికారులకు ఏవేవో కారణాలు చెప్పి భయాందోళనలకు గురిచేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ కారణంగానే ప్రస్తుతం జిల్లా వైద్యాధికారిగా సెలవుల్లో ఉన్న పద్మ విధుల్లో చేరేందుకు జంకుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

ప్రైవేటు ఆసుపత్రుల నుంచి మామూళ్లు

ఎన్నో ఏళ్లుగా తిష్టవేసిన వైద్యశాఖ ఉద్యోగులు కొందరు జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రైవే టు ఆసుపత్రుల నుంచి వచ్చే మామూళ్లతో పాటు అద్దె ప్రతిపాదికన వాహనాలను ఏ ర్పాటు చేసుకుని ఆ డబ్బును కూడా పొందుతున్నట్టు తెలుస్తున్నది. వైద్యశాఖలో గూడుపుఠాణి గురించి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్‌కు తెలిసినట్టు సమాచారం. 

మూడేళ్లుగా కొనసాగుతున్న చంద్రశేఖర్

ఇన్‌చార్జి డీఎంహెచ్‌వోగా కొనసాగుతున్న చంద్రశేఖర్ గత మూడు సంవ త్సరాల నుంచి ఇక్కడే పాతుకుపోయా రు. గూడు పుఠానీ సభ్యుల సూచనల మేరకే చంద్రశేఖర్ కామారెడ్డి డిప్యూటీ డీఎంహెచ్‌వోగా ఉంటూ ఇన్‌చార్జి డీఎంహెచ్‌వోగా కొనసాగుతున్నట్టు తెలుస్తున్నది. కింది స్థాయి ఉద్యోగుల కనుసన్నల్లోనే ఆయన కొనసాగుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.