calender_icon.png 13 January, 2025 | 3:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

త్వరలో డీసీసీ అధ్యక్షుని మార్పు?

05-01-2025 12:00:00 AM

  1. సంక్రాంతి తర్వాత ప్రకటించే అవకాశం
  2. కవ్వంపల్లిపై పొన్నం గుస్సా

కరీంనగర్, జనవరి 4 (విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్నవేళ కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవిని మార్చాలని పార్టీ భావిస్తున్నది. ప్రస్తుతం పార్టీ అధ్యక్షునిగా మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారా యణ కొనసాగుతున్నారు. ఆ యన స్థానంలో కరీంనగర్ పార్ల మెంట్ నియోజకవర్గ ఇంచార్జి వెలిచాల రాజేందర్రావును నియ మించాలనే ఆలోచనలో పార్టీ ఉం ది.

ప్రస్తుత నగర కాంగ్రెస్ కమిటీ అధ్య క్షుడు, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి పేరు పరిశీలనలో ఉన్నప్పటికి రాజేం దర్రావువైపు రాష్ర్ట బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది. రాజేందర్రావు పేరే ఫైనల్ అయ్యే అవకాశం ఉంది. రాష్ర్ట వ్యాప్తంగా ఇప్పట్లో మార్పులు లేకున్నా కరీంనగర్ జిల్లాలో మార్చవలసిందేనని మంత్రి పొన్నం ప్రభాకర్ పట్టుబడుతు న్నట్లు తెలిసింది.

ఇటీవల పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జి పురుమల్ల శ్రీనివాస్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయమైన ఇందిరాభవన్లో అసమ్మతి స మావేశం ఏర్పాటు చేసి పొన్నం ప్రభాకర్‌కు వ్యతిరేకంగా గళం విప్పడం వివాదయింది. పురుమల్ల శ్రీనివాస్‌పై చర్యలు తీసుకోవాలని ఇప్పటికే పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌కు ఫిర్యాదు లు వెళ్లాయి.

తనకు వ్యతిరేకంగా సమా వేశం ఏర్పాటు చేస్తున్నారని తెలిసి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ పార్టీ కార్యాలయంలో అసమ్మతి సమావేశం ఏర్పాటు చేయడానికి అవకాశం ఇవ్వడంపై మంత్రి పొన్నం ప్రభాకర్ గుస్సాగా ఉన్నట్లు తెలిసింది. కవ్వంపల్లి తెలిసే పురుమల్లకు అవకాశం కల్పించారని పొన్నం వర్గీయు లు బాహటంగానే అంటున్నారు.

కరీంనగర్ జిల్లా కింద కరీంనగర్, మాన కొండూర్, చొప్పదండి, హుజూరాబాద్ నియోజకవర్గాలున్నాయి. వీటితోపాటు హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలోని చిగురుమామిడి, సైదాపూర్ మండలాలు జిల్లా పరిధిలో ఉన్నాయి. ప్రస్తుతం 313 పంచాయతీలు ఉండడంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని ముందుకు నడిపించడా నికి తనకు అనుకూలమైన వ్యక్తికి పార్టీ అధ్యక్ష పదవి కట్టబెట్టాలనే ఆలోచనలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నారు.

ఇప్పటికే వెలిచాల రాజేందర్రావు తన అనుచరులతో సమావేశం నిర్వహించారు. హైదరాబాద్లో ఇటీవల పలుమార్లు సీఎంను కలిశారు. పార్టీ జిల్లా అధ్యక్ష పదవి ఇస్తే పనిచేయడానికి సుముఖత కూడా వ్యక్తం చేశారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి కూడా ఎమ్మెల్యేల పనితీరుపై ఆరాతీసి పనితీరు మార్చుకోవాలన్న అల్టిమే టం కూడా ఇచ్చారు.

ఇందులో కరీంనగర్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఇద్దరిలో ఒక ఎమ్మెల్యే ఉన్నట్లు తెలిసింది. ఇప్పటికే గ్రామాల్లో పర్యటించి స్థానిక సంస్థల ఎన్నికలకు బలమైన అభ్యర్థులను బరిలో ఉంచాలని సూచించ డంతో మంత్రి పొన్నం ప్రభాకర్ ఇప్పటికే విస్తృతంగా పర్యటిస్తున్నారు.

ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యంలు పర్యటించేందుకు సిద్ధమవుతు న్నారు. హుజూరాబాద్ ఇంచార్జి ప్రణవ్ బాబు అక్కడే మకాం వేసి సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం కరీంనగర్ ఇంచార్జిగా ఉన్న పురుమల్ల శ్రీనివాస్ స్థానంలో మరొకరిని నియమించే అవకా శం ఉండడంతో నియోకవర్గంలో సమా వేశాలు ప్రారంభం కాలేదు.