calender_icon.png 31 January, 2025 | 4:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చర్చలకు పిలుపువచ్చేనా..?

29-01-2025 01:11:59 AM

  • ఆర్టీసీ జేఏసీ సమ్మె నోటీసుతో ఒత్తిడిలో యాజమాన్యం

సమస్యలు పరిష్కారం కాకుంటే సమ్మె తప్పదంటున్న జేఏసీ నేతలు

కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో ఒక్క హామీ నెరవేర్చలేదంటూ ఆవేదన

హైదరాబాద్, జనవరి 28 (విజయక్రాం తి): ఊహించని విధంగా ఆర్టీసీ జేఏసీ సమ్మె నోటీసు ఇవ్వడంతో ఆర్టీసీ యాజమాన్యం ఉక్కిరిబిక్కిరవుతోంది. అంతా బాగానే ఉందన్నట్లు ప్రభుత్వానికి చెబుతూ సంస్థను నడిపిస్తున్న అధికారులు సమ్మె నోటీసుతో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నట్లు తెలుస్తోంది. అందుకే కీలకమైన ఓ అధికారి సెలవులో ఉంటూ తిరిగి విధుల్లో చేరేందుకు కూడా తటపటాయిస్తున్నారని సమాచారం.

ఎన్నికలకు ముందు ఎన్నో హామీలు గుప్పించిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ బాటలోనే వెళ్తోందని అంటున్నారు. ట్రేడ్ గుర్తింపు దేవుడెరుగు కనీసం కార్మిక సంఘాల నేతలను బస్ భవన్‌లోకి కూడా రానిచ్చే పరిస్థితి లేదంటున్నారు. కేసీఆర్ హయాంలో చక్రం తిప్పుతూ వచ్చినా ఓ కీలక అధికారి.. ప్రభుత్వం మారినా కూడా అదే రీతిన నేటికీ సంస్థను ఆగం చేస్తూనే ఉన్నాడని కార్మికులు ఆరోపిస్తున్నారు. 

జేఏసీ రూపంలో కొత్త శక్తి..

ప్రైవేట్ కంపెనీలు కాకుండా ప్రభుత్వమే ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడితే సమ్మె అవసరం ఉండేది కాదని జేఏసీ వర్గాలంటున్నా యి. అలాగే విలీనం చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదని అందుకే సమ్మె కు పోవడం తప్ప తమకు వేరే దారి లేకుం డా పోయిందని జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న ‘విజయక్రాంతి’కి తెలిపారు. తమ ఉనికికే ప్రమాదం ఏర్పడిన ఫలితంగానే సమ్మెకు పిలుపునిచ్చినట్లు జేఏసీ వైస్ చైర్మన్ థామస్‌రెడ్డి పేర్కొన్నారు. 

ప్రభుత్వానికి ఆర్టీసీ జేఏసీ సమ్మె నోటీస్

రాష్ర్ట ప్రభుత్వానికి, ప్రభుత్వ అధికారులకు తెలంగాణ ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో సమ్మె నోటీసులను అందించారు. మంగళవారం సీఎస్ శాంతికుమారి, రవాణా శాఖ మంత్రి ఓఎస్డీ వేణు, ఆర్‌అండ్‌బీ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఆర్టీసీ ఇన్‌చార్జి ఎండీ వికాస్‌రాజ్, కార్మిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సంజయ్‌కుమార్‌కు సమ్మె నోటీస్ ఇచ్చారు. కార్యక్రమం లో జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న, జేఏసీ నాయకులు ఎన్ కమలాకర్‌గౌడ్, సీహెచ్ కృష్ణ, సుద్దాల సురేశ్, కత్తుల యాదయ్య, బీ యాదయ్య ఉన్నారు. 

అన్ని సంఘాలు కలిసే..

ప్రస్తుతం జేఏసీగా ఏర్పడిన ఆర్టీసీ కార్మికులు 6 సంఘాలతో కలిసి ఉన్నా రు. ప్రధాన సంఘాలన్నీ జేఏసీలో ఉన్నాయని జేఏసీ నాయకులంటున్నా రు. అయితే జేఏసీలో లేని యూనియ న్లు సైతం సమ్మెకు తప్పనిసరిగా మద్దతు ఇవ్వాల్సిన పరిస్థితి కనిపిస్తోందని కార్మికులు చెబుతున్నారు.

ఆర్టీసీని ప్రైవేట్ పరం కాకుండా బతికించుకునేందుకు ఇంతకుమించిన అవకాశం ఉండబోదని కార్మికులంతా భావిస్తున్నారు. ప్రభుత్వం చర్చలకు పిలవ కుంటే ఫిబ్రవరి 9 తర్వాత జరగబోయే సమ్మె తప్పదని, కచ్చితంగా అన్ని సంఘాలు మద్దతు ఇస్తాయని అంచనా వేస్తున్నారు.