calender_icon.png 17 November, 2024 | 3:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అడవి బిడ్డల కష్టాలు తీరవా?

26-07-2024 12:05:00 AM

వరుణుడి ప్రతాపంలో ములుగు, ఏటూరు నాగారం లాంటి ఏజన్సీ ప్రాంతాల ప్రజలు గత వారం రోజులుగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాగులు, వంకలు సొంగిపొర్లడంతో  ప్రజలు అత్యవసర నులకోసం పట్టణాలకు రావాలన్నా వీలు లేకుండా పోతోంది. గర్భిణీలు, విద్యార్థులు వంటి వారి అవస్థలు చెప్పనలవి కాదు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడిచినా గిరిజన ప్రాంతాలకు కనీస అవసరాలయిన తాగు నీరు, రోడ్లు, విద్యుత్, వైద్యం, విద్య వంటివి లభించడం లేదంటే రాజకీయ నేతలు సిగ్గుతో తలదించుకోవాలి.

వాళ్ల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెప్పడమే తప్ప వారి బతుకుల్లో వెలుగులు వచ్చిన దాఖలాలు మాత్రం లేవు. ఇది ఒక్క తెలంగాణకే పరిమితం కాదు. దేశం అంతటా ఇదే పరిస్థితి ఉంది. ‘వికసిత్ భారత్’ లాంటి చెవులకు ఇంపైన నినాదాలు చేసినంతమాత్రాన లాభం ఉండదు. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న ఇలాంటి వారి జీవితాల్లో వెలుగులు నింపినప్పుడే అలాంటి నినాదాలకు సార్థకత వస్తుంది.  వంద కిలోమీటర్ల రోడ్లు, ఓ ఆస్పత్రి, బడి, తాగు నీరు  ఏర్పాటు చేయలేని ప్రభుత్వాలు లక్షల కోట్ల అంచనాలతో బడ్జెట్‌లు ప్రతి ఏటా ప్రవేశపెట్టడంలో అర్థం లేదు.

రేఖానాయక్, హనుమకొండ