calender_icon.png 30 October, 2024 | 6:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సిరీస్ సొంతమయ్యేనా?

29-10-2024 12:39:35 AM

  1. నేడు భారత్, కివీస్ మూడో వన్డే 
  2. ఎవరు గెలిస్తే వారిదే సిరీస్

అహ్మదాబాద్: ప్రతిష్ఠాత్మక మహిళల టీ20 ప్రపంచకప్‌లో మనల్ని చావుదెబ్బ కొట్టిన కివీస్ మీద ప్రతీకారం తీర్చుకునేందుకు భారత్‌కు మంచి అవకాశం  దొరి కింది. స్వదేశంలో జరుగుతున్న వన్డే సిరీస్‌లో ఇరుజట్లు 1-1తో సమంగా ఉన్నాయి. దీంతో నేడు జరగనున్న నిర్ణయాత్మక మూడో వన్డేలో ఎవరు గెలిస్తే సిరీస్ వారి సొంతమవనుంది.

తొలి వన్డేలో గెలిచిన హర్మన్ సేన రెండో వన్డేలో కివీస్‌కు తలవంచింది. అహ్మదాబాద్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. తొలి మ్యాచ్‌లో 59 పరుగుల తేడాతో విజయం సాధించిన హర్మన్ సేన రెండో వన్డేలో మాత్రం చేజింగ్‌లో విఫలమైంది. వైస్ కెప్టెన్ మంధాన వరుసగా విఫలం కావడం ఆందోళన కలిగిస్తోంది.

ఇక బౌలింగ్ విభాగంలో రాధా యాదవ్ రెండు వన్డేలు కలిపి ఏడు వికెట్లు పడగొట్టి మంచి ఫామ్‌లో ఉండగా.. రేణుకా, పూజా, దీప్తి శర్మలతో బౌలింగ్ పటిష్టంగా ఉంది. మరోవైపు తొలి వన్డేలో చతికిలపడినప్పటికీ రెండో వన్డేలో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో న్యూజిలాండ్ విజ యాన్ని నమోదు చేసింది. సుజీ బేట్స్, జెక్ కెర్, బ్రూక్ హాలిడే, లియా, ఈడెన్ కార్సన్ మరోసారి కీలకం కానున్నారు.