calender_icon.png 26 February, 2025 | 3:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సెంటిమెంట్ నిలబెడుతుందా?

26-02-2025 12:17:38 AM

ఈ మధ్య కాలంలో రష్మిక మందన్నాకు టైం బాగా కలిసొస్తోంది. ఏ సినిమా చేసినా కూడా అది బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ‘పుష్ప’, ‘పుష్ప2’ చిత్రాలు వసూళ్ల సునామీ సృష్టించాయి. ఆ తరువాత బాలీవుడ్‌లో ‘ఛావా’ చేస్తే అది కూడా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఈ సినిమా ఇప్పటికే రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.

ఈ సినిమా రష్మికకు బాలీవుడ్‌లో మంచి పేరు తెచ్చి పెట్టింది. ఇప్పటికే ‘యానిమల్’ సక్సెస్‌తో ఫుల్ ఖుషీగా ఉన్న రష్మికకు ‘ఛావా’ సినిమా బాలీవుడ్‌లో తన స్థానాన్ని పదిల పరుచుకునేందుకు బాగా ఉపయోగపడింది. ఇక ఇప్పుడు రష్మికకు అసలైన టెస్టింగ్ టైం స్టార్ట్ అయ్యింది. ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం బాలీవుడ్‌లో ‘సికిందర్’ సినిమా చేస్తోంది.

మురగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. అయితే సల్మాన్  మురగదాస్ ఇద్దరూ కొంతకాలంగా ఫ్లాప్‌ల్లోనే కొట్టుమిట్టాడుతున్నారు. సల్మాన్‌కు ‘టైగర్ 3’ తర్వాత.. మురగదాస్‌కు ‘సర్కార్’ తర్వాత హిట్ పడిందే లేదు. ప్రస్తుతం వీరిద్దరికీ సక్సెస్ చాలా అవసరం.

అయితే ప్రస్తుతం ఈ సినిమాకు రష్మిక సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందని అంతా భావిస్తున్నారు. ఆమె ఏ సినిమాలో నటిస్తే ఆ సినిమా తప్పక సక్సెస్ అవుతోంది కాబట్టి ఈ సినిమా కూడా సక్సెస్ అవుతుందని అంతా నమ్మకంతో ఉన్నారు. ఇక చూడాలి ఏం జరుగుతుందో..