calender_icon.png 29 November, 2024 | 2:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కంది కలిసొచ్చేనా?

29-11-2024 12:34:32 AM

  1. పత్తి చేలలో అంతర పంటగా.. జిల్లావ్యాప్తంగా 38వేల ఎకరాల్లో సాగు
  2. ఈ ఏడాది మద్దతు ధర పెంచిన కేంద్రం
  3. ప్రస్తుత వాతావరణం అనుకూలమంటున్న అధికారులు

కుమ్రంభీం ఆసిఫాబాద్, నవంబర్ 28 (విజయక్రాంతి): జిల్లా వ్యాప్తంగా రైతులు పత్తి పంటలో అంతర పంటగా కంది సాగు చేస్తున్నారు. అయితే ఈ ఎడాది వర్షాభావ పరిస్థితుల కారణంగా పత్తి దిగుబడిపై అన్నదాతల్లో గుబులు మొదలైంది.

ఎకరానికి పది క్వింటళ్లకు పైగా రావాల్సిన దిగుబడి ఏడు క్వింటాళ్లకు పడిపోయింది. కాగా అంత ర పంటగా సాగుచేసిన కంది పూత దశ నుం చి కాత దశకు చేరుకున్నది. వాతావరణం ఇలాగే ఉంటే కంది పంట దిగుబడికి డోకా ఉండదని అన్నదాతలు అనుకుంటున్నారు. 

38వేల ఎకరాల్లో కంది సాగు..

జిల్లావ్యాప్తంగా వానకాలంలో రైతులు 38 వేల ఎకరాల్లో కంది పంటను సాగు చేసినట్టు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం పూత, కాత దశకు చేరుకోగా నెల రోజుల్లో పంట చేతికొచ్చే అవకాశం ఉన్నది. ప్రస్తుత కాలంలో పురుగు, తెగుళ్లు పంటను ఆశించే అవకాశం ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

సాళ్లను బట్టి ఎకరాకు 6 నుంచి 8 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. కేంద్రప్రభుత్వం కంది పంటకు ఈ ఏడాది  మద్దతు ధరను పెంచడంతో రైతులకు కొంత ఊరట లభించింది. నాణ్యమైన కందులకు క్వింటాల్‌కు ధర రూ.7,550 లభించనున్నది. అయితే ప్రస్తుతం వర్షం కురిస్తే మాత్రం పంటను పురుగు ఆశించి పూత, పిందె రాలిపోయే ప్రమాదమున్నది. 

ఆహారధాన్యాల సాగుపై శ్రద్ధ పెట్టాలి

 రైతులు వాణిజ్య పంటలతో పాటు ఆహారధాన్యాల సాగుకు శ్రద్ధ చూపితే వ్యవసాయంలో కలిసొస్తుంది. వర్షాకాలంలో జిల్లాలో ఎక్కు వగా పత్తి పంట సాగు చేస్తుంటారు. అందులో అంతర పంటగా కందిని వేయడంతో దానికి ప్రత్యేకంగా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉంది. పూ త, కాతదశలో మాత్రమే తెగుళ్లు, పు రుగుల నివాణకు మందులు వాడా ల్సి ఉంటుంది. ఈ ఎడాది కంది పంట ఆశాజనకంగా ఉంది. వాతావరణం అనుకూలిస్తే రైతులకు కంది పంటలో మంచి దిగుబడి వస్తుంది. 

శ్రీనివాసరావు, జిల్లా 

వ్యవసాయాధికారి, ఆసిఫాబాద్

ఇప్పటికైతే బాగానే ఉంది..

పత్తి పంటలో కంది సాల్లు వేసినం. ఇప్పుడు పూత రావడంతో పాటు పిందెలు పడుతున్నాయి. మబ్బులు రాకపోతే పంటకు డోకా ఉండదు. దేవుడిపై భారం వేసినం. ఈ ఎడాది వర్షాల కారణంగా పత్తి దిగుబడి బాగా తగ్గింది. కంది పంటైనా వస్తే నష్టం నుంచి బయటపడుతాం.

 సప్తే జయరాం, రైతు, బురుగూడ, ఆసిఫాబాద్ జిల్లా