calender_icon.png 27 October, 2024 | 12:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చరా?

09-07-2024 01:13:33 AM

 హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందన్న బీఆర్‌ఎస్ నేత దేవిప్రసాద్

హైదరాబాద్, జూలై 8 (విజయక్రాంతి): నిరుద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ హామీలను నేరవేర్చడంలో విఫలమైందని బీఆర్‌ఎస్ నేత దేవిప్రసాద్ ఆరోపించారు. ఎమ్మెల్యేలను చేర్చుకోవడం తప్ప నిరుద్యోగుల సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. మెగా డీఎస్సీ ద్వారా 25 వేల టీచర్ పోస్టులు, అధికారం చేపట్టిన ఆరునెలల్లో రెండు లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ వేస్తామని వాగ్ధానం చేశారే తప్ప.. ఆ దిశగా ప్రయత్నం చేయడం లేదన్నారు. దీంతో రాష్ట్రంలోని నిరుద్యోగులు టీజీపీఎస్సీ ముందు ఆందోళనలు చేసే దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. నిరసన వ్యక్తం చేసే యువకులను ప్రభుత్వం అరెస్టు చేసి చిత్రహింసలకు గురిచేస్తుందని, ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యం నిధులు విడుదల చేయలేదని మండిపడ్డారు.