calender_icon.png 5 December, 2024 | 7:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బిల్లుల బాధలు తీరేనా?

05-12-2024 12:17:49 AM

  1. నిర్మల్ జిల్లాలో రూ.50 కోట్ల బిల్లులు పెండింగ్ 
  2. ఆందోళన బాట పట్టిన తాజా మాజీ సర్పంచ్‌లు
  3. అప్పులకు వడ్డీ కట్టలేక పోతున్న ప్రజాప్రతినిధులు
  4. రాబోయో స్థానిక ఎన్నికలపై నిరాసక్తత

నిర్మల్, డిసెంబర్ 4 (విజయక్రాంతి): గత ప్రభుత్వ హాయంలో అప్పులు తెచ్చి చేసిన అభివృద్ధి పనులకు నేటికీ బిల్లులు చెల్లించకపోవడంతో తాజా మాజీ సర్పంచులు ఆం దోళన బాట పట్టారు. తెచ్చిన అప్పులకు వడ్డీ లు కూడా కట్టలేకపోతున్నామని ఆవేదన చెందుతున్నారు.

ఓ వైపు పదవీకాలాలు పూ ర్తయ్యి త్వరలో ఎన్నికలకు కసరత్తు చేస్తుండగా, గతంలో చేసిన పనులకు సంబంధించి భారీగా బకాయిలు ఉండటంతో తలలు పట్టుకుంటున్నారు. పాత బిల్లులు చెల్లించిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్‌చేస్తున్నారు. నిర్మల్ జిల్లాలో మొత్తం 19 మండలాలు, ౪౦౦ గ్రామ పంచాయతీలు ఉన్నాయి.

గత ప్రభుత్వం గ్రామాల్లో వివిధ పథకాల ద్వారా అభివృద్ధి పనులు మం జూరు చేసింది. ఇందులో సీసీ రోడ్లు, మురికి కాలువలు, శ్మశాన వాటికలు, రైతు వేదికలు, మన ఊరు బడి, పల్లె పకృతి వనాలు, క్రీడా మైదానాలు, డంప్‌యార్డులు, పంచాయతీ నూతనల భవనాలు ఇలా 30 రకాల పనులు చేపట్టింది.

పనులు పూర్తి చేయాలని అప్పటి జిల్లా అధికారులు ఒత్తిడి తేవడంతో సర్పంచ్‌లు అప్పులు తెచ్చి మరీ పనులు పూర్తిచేశారు. అధికారుల ద్వారా ఎంబీ రికార్డులు చేసి సంబందిత కార్యాలయా ల్లో అందించిన బిల్లులు మాత్రం క్లియర్ చేయడం లేదని సర్పంచ్‌లు వాపోతున్నారు. 

నిర్మల్ జిల్లాలో బకాయి రూ.50 కోట్లు

నిర్మల్ జిల్లాలో వివిధ గ్రామ పంచాయతీల్లో సర్పంచ్‌లు చేపట్టిన పనులకు సంబంధించి రూ.50 కోట్ల వరకు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని అధికారులు చెప్తున్నారు. 2022 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బిల్లులతోపాటు 20౨౩ సంబంధించిన బిల్లులు ఉన్నట్టు తెలిపారు. ఏడాదిన్నర కాలం నుంచి బిల్లులు రావడం లేని పలువరు సర్పంచ్‌లు చెప్తున్నారు.

ఎంబీ రికార్డు పూర్తి అయిన పనులకు బిల్లులు రావడం లేదన్నారు. కొన్ని పనులు పూర్తయినా అధికారులు రికార్డు చేయడం లేదని, మరికొన్ని ట్రెజరీలో పెండింగ్ అని చూపుతుందని చెప్పారు. బిల్లుల విషయంలో కలెక్టర్, పంచాయతీరాజ్ కమిషనర్, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కను సైతం కలిసినా తమకు న్యాయం జరుగడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు.

పనులు పూర్తి చేయాలని ఒత్తిడి తెచ్చిన అధికారులు.. ఇపుడు బిల్లులు ఇవ్వమని అడిగితే తమ పరిధిలో లేదని దాట వేస్తున్నారని వాపోతున్నారు. బిల్లుల కోసం తాము ఆందోళనలు చేస్తున్న వారు పట్టించుకోవడం లేదని వారు తెలిపారు రెండు నెలల క్రితమే బిల్లులు చెల్లింస్తామని చెప్పిన అధికారులు మాట నిబెట్టుకోలే పోతున్నారని వారు పేర్కోన్నారు.

ఉన్న నిధులపై ఆంక్షలు సరికాదు 

ఒకవైపు గ్రామ పంచాయతీల్లో పెడింగ్ బిల్లులను చెల్లించక ఇబ్బందికి గురిచేస్తున్నారు. మరోవైపు గ్రామ పంచాయతీల్లో నిల్వ ఉన్న నిధులపై ఆంక్షలు విధించడం సరికాదు. ప్రజల నుంచి వసూలు చేసిన పన్నులు గ్రామ పంచాయతీ ఖాతాలో జమచేస్తున్నాం. వాటిద్వారానైనా చిన్నచిన్న బిల్లులు చెల్లించటం లేదు. నిధులపై ప్రభుత్వం ప్రీజింగ్‌ను ఎత్తివేయాలి.

 ఒడ్నం అశ్విని, సర్పంచ్, తురాటి, నిర్మల్ జిల్లా

50 లక్షలు రావాలి 

మాది మేజర్ గ్రామ పంచాయతీ. మా గ్రామంలో ప్రభుత్వం మంజూరు చేసిన పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లులు రూ.50 లక్షలు రావాలి. అధికారులు పనులు చేయాలని ఒత్తిడి తేవడంతో అప్పులు  చేసి మరి పనులు పూర్తిచేశాం. బిల్లులు వచ్చాక అప్పులు కట్టుదామని అనుకుంటే ఏడాది గడిచినా ఇవ్వట్లేదు. తెచ్చిన అప్పులపై వడ్డీలు కట్టలేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాం. అధికారులను అడిగితే తమ చేతిలో ఏమీలేదని చెప్తున్నారు. వెంటనే పెండింగ్ బిల్లులు వెంటనే చెలించాలి.

రాంరెడ్డి , సర్పంచ్, నర్సాపూర్(జి), నిర్మల్ జిల్లా