calender_icon.png 28 December, 2024 | 6:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొత్త జిల్లాలంటూ ఉన్నవి తగ్గిస్తారా!

02-11-2024 01:04:06 AM

కేంద్రమంత్రి బండి సంజయ్

హైదరాబాద్, నవంబర్ 1 (విజయక్రాంతి): రాష్ట్రంలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేసేందుకు జిల్లా, మండలాల పునర్వ్యవస్థీకరణను సమీక్షిస్తానని కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చిందని.. ఇప్పుడు ఉన్న జిల్లాలను తగ్గించేందుకు ప్రయత్నిస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ శుక్రవారం  ట్వీట్ చేశారు. రాష్ట్రంలో 10 జిల్లాలను 33 జిల్లాలుగా గత ప్రభుత్వం మార్చింది.

కేసీఆర్ సర్కార్ రాజకీయ అవసరాలకు అనుగుణంగా కొన్ని జిల్లాలను ఏర్పాటు చేసిందని సీఎం రేవంత్ రెడ్డి గతంలో పేర్కొన్నారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజక వర్గాన్ని నారాయణపేట, వికారాబాద్ జిల్లాల పరిధిలోకి వచ్చేలా చేసిన జిల్లాల విభజనపై ఆయన విమర్శలు చేశారు.

ఆ నేపథ్యంలోనే రాష్ర్టంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేపడతామని, అవసరమైతే సంఖ్య ను తగ్గించాలని సూచించేందుకు న్యాయ కమిషన్‌ను కూడా నియమించాలని ప్రభు త్వం భావిస్తున్నట్లు సీఎం గతంలో మీడియాతో చిట్‌చాట్ సందర్భంగా తెలిపారు. ఈ తరుణంలో ఇప్పుడు కేంద్రమంత్రి జిల్లాల విభజన అంశంపై ట్వీట్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.