18-02-2025 12:00:00 AM
గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయదారులకు కోతుల బెడద అధికంగా ఉంది. ఏ పం ట వేసినా దక్కడం లేదని రైతులు వాపోతున్నారు. ఆరుతడి పంటలు వేస్తే కోతులకే సరిపోతుందని, ఉన్న కొద్దో గొప్ప భూమిలో వరినాట్లు వృథా చేసుకుంటున్నామని రైతు లు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.
అన్ని ప్రాంతాలలోనూ కోతుల బెడద రోజురోజు కూ ఎక్కువవుతున్నది. వీటిని కంట్రోల్ చే యడం ఎవరివల్లా కావడం లేదు. ఇక, ప్రభుత్వపరంగా అధికారులు, ప్రజాప్రతినిధులు, మంత్రివర్గం సమస్యను సీరియస్‌గా తీసుకుంటున్నట్టు లేదు. ఉభయ తెలుగు రాష్ట్రాల లో కోతుల ఆగడాలు శ్రుతి మించుతున్నా యి.
వాటికి ఆవాస కేంద్రాలుగా వున్న అడవులు నశించడమే దీనికి ప్రధాన కారణం. కోతులవల్ల ఇళ్లల్లోనూ, వ్యవసాయ క్షేత్రాల్లోనూ ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియ డం లేదు. అనేక ప్రాంతాలలో రోడ్లమీద వెళ్లేవాళ్లపైకి అవి దాడి చేస్తున్నాయంటే తీవ్రతను అ ర్థం చేసుకోవచ్చు. వాటి నుండి తప్పించుకోవడానికి ఎంత ప్రయత్నం చేసినప్పటికీ అసాధ్యం.
ఇళ్లలోకి చొరబడి, ఎన్నో ఆహార పదార్థాలను విచ్చలవిడిగా పారబోసి, నష్టం చేస్తు న్న సందర్భాలు కూడా అనేకం. ఎవరికి వా రు వీటిపట్ల అసహనం వ్యక్తం చేస్తూ, బాధపడుతూ, కర్రలతో బెదిరిస్తున్నారే తప్ప సమగ్ర, సామూహిక కార్యాచరణకు అవకాశం ఉండడం లేదు.
ఇంకా కొన్నిచోట్ల కొం తమంది వీటిపట్ల స్థానికులకు ఫిర్యాదు చే యడం లేదా నిరసన తెలుపడం వంటి చర్య లు చేపట్టినప్పటికీ అవన్నీ తాత్కాలికమూ అవుతున్నాయి. మరి కొన్నిచోట్ల వాటిని దూరంగా తీసుకువెళ్లి విడిచిపెట్టి వస్తున్నారు. దాంతో అవి ఆ కొత్త ప్రాంతంలో పెరుగుతున్నాయి. ప్రధానమైన కారణాలను, నివార ణ పరిష్కార మార్గాలను వెతకవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.
డా.ఆర్.ఎ.