- ధాన్యం కొనుగోళ్లలో తీవ్ర జాప్యం
- ప్రభుత్వ లక్ష్యం 91 లక్షల మెట్రిక్ టన్నులు..
- ఇప్పటివరకు 7.80లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ
- నిర్వాహకులు మిల్లర్లతో కుమ్మక్కే ప్రధాన కారణం
- నిబంధనలు సడలించాలంటున్న రైతులు
హైదరాబాద్, నవంబర్ 1౫ (విజయక్రాంతి) : రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ధాన్యం కొనుగోళ్లు మందకొడిగా జరుగుతున్నాయి. కొనుగోలు కేంద్రాల నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగా ఆశించిన స్థాయిలో సేకరణ జరగడం లేదు. ఇప్పటివరకు 10లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించడంలో అధికారు లు విఫలమయ్యారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
బీఆర్‌ఎస్ హయాంలో చురుకుగా వ్యవహరించిన అధికారులు ప్రస్తుతం కొనుగోళ్లలో అలసత్వం వహిస్తున్నారని రైతుసం ఘాలు ఆరోపిస్తున్నాయి. వారం రోజులుగా కొనుగోలు కేంద్రాలకు ధాన్యం పెద్ద మొత్తం లో వస్తున్నది. అయితే తేమ శాతం, తాలు, తరుగు పేరుతో అధికారులు తూకం వేయకుండా ఐదారు రోజుల పాటు అపుతున్నా రు.
కాగా ఈ ఏడాది రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం 91 లక్షల మెట్రిక్ టన్ను ల ధాన్యం సేకరణ ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఇప్పటివరకు 7,234 కేంద్రాల ద్వా రా 7.80 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేసింది.
గతేడాది ఇదే సమయానికి 15 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించి సీఎంఆర్‌కు తరలించగా.. ప్రస్తుతం నిబంధనలు పేరుతో రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారనే విమర్శలు గుప్పుమం టున్నాయి. సన్నవడ్లను గుర్తించేందుకు ఏర్పాటు చేసిన మిషన్లు సక్రమంగా పనిచేయకపోవడంతో జిల్లా వ్యవసాయశాఖ అధి కారులు వచ్చే వరకు ధాన్యాన్ని అక్కడే నిల్వ చేస్తున్నారు.
తేమ 20శాతానికి మించి ఉంటే ఎండబెట్టిన తరువాత నాలుగు రోజుల సమ యం తీసుకుని తూకం వేస్తున్నారు. కొనుగో లు చేసిన వడ్లను మిల్లులకు తరలించేందుకు లారీలు రాకపోవడంతో మరింత ఆలస్యమవుతోంది. దీంతో కేంద్రంలో స్థలం లేక మిగి లిన రైతులు కల్లాల్లోనే ధాన్యాన్ని ఉంచాల్సి వస్తోంది. కేంద్రాలకు వస్తున్న వడ్లకు అధికారులు సవాలక్ష కొర్రీలు పెడుతూ రోజుల తరబడి ధాన్యాన్ని అక్కడే ఉంచుతున్నారు.
దీంతో మిగిలిన రైతులు ధాన్యాన్ని కల్లాల వద్దనే ప్రైవేట్ వ్యాపారులకు తక్కువ ధరకే విక్రయిస్తున్నారు. రవాణా, కూలీల ఖర్చు మిగిలిపోగా, తేమ, తాలు వంటి సాకులు చెప్పకుండా దళారులు నేరుగా కొంటున్నారు.
మిగిలింది నెలరోజులే..
ఖరీప్‌లో 60.39 లక్షల ఎకరాల్లో వరి పంట సాగు చేయగా, 145 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఈక్రమంలో 91.28లక్షల మెట్రిక్ టన్ను లు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. అయితే నెల రోజులుగా అనుకున్న లక్ష్యంలో 10శాతం ధాన్యం సేకరణ కూడా జరగలేదు.
ఇంకా నెలరోజులే సమయం ఉండగా.. కొనుగోలు కేంద్రాల్లో నిత్యం తనిఖీలు చేస్తూ ఎంచుకున్న లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. కొనుగోలుకు నిబంధనలు, సకాలంలో డబ్బులు చెల్లించకపోవడం, కేంద్రాల నిర్వాహకులు మిల్లర్లతో చేతులు కలపడం వల్ల ధాన్యం సేకరణకు తీవ్ర ఆటం కం కలుగుతున్నదని ఉన్నతాధికారులు చెబుతున్నారు.