calender_icon.png 26 December, 2024 | 1:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘాట్ రోడ్డు నిర్మాణమయ్యేనా?

26-12-2024 01:34:44 AM

  1. మామిడిపల్లి ఆలయ అభివృద్ధికి రూ.1.29 కోట్లు
  2. మూడేళ్లుగా సాగుతున్న పనులు
  3. ఆలయ అభివృద్ధిపై అధికారుల శీతకన్ను
  4. నిర్మాణ పనులు పూర్తికాక భక్తుల ఇక్కట్లు

-కలెక్టర్ దృష్టిసారించాలంటున్న భక్తులు

కోనరావుపేట, డిసెంబర్ 25: పురాతన ఆలయ అభివృద్ధి నిర్మాణం పరులపై ఆలయ అధికారులు శీతకన్ను ప్రదర్శిస్తున్నా రు. మండలానికే ప్రసిద్ధ పుణ్య క్షేత్రమైనా మామిడిపల్లి శ్రీ సీతారామచంద్రస్వామి ఆల యంలో పలు అభివృద్ధి పనులకు మోక్షం లభించడం లేదు. వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామి ఆలయ దత్త దేవాలయ మైనా సీతారామచంద్రస్వామి ఆలయం ఘాట్ రోడ్డు నిర్మాణం పనులు నిలిచిపో యాయి.

మూడేళ్లుగా  కొనసాగుతున్న పను లు చేయడం కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, అధి కారుల అలసత్వంతో భక్తులకు శాపంగా మారింది. రెండేళ్ల క్రితం మాఘ అమావాస్య జాతరకు పూర్తి చేయాల్సిన ఘాట్ రోడు నిర్మాణం పనులు  గత యేడాది ఫిబ్రవరి 9న నిర్వహించిన మాఘ అమావాస జాతర కు సైతం పూర్తి చేయలేకపోయారు. గుట్ట పై స్వామి వెలయడం స్వామి వారిని దర్శించు కోకవడానికి భక్తులు మెట్ల మార్గం ద్వారా వెళి దర్శనం చేసుకునేవారు, కాగా మెట్లు ఎక్కువగా ఉండడం, వృద్ధులకు అనారోగ్య సమస్యలు ఉన్న వారు గుట్టపైకి వెళ్లేందుకు అవస్థలు పడేవారు.

వారి సమస్యలను దూరం చేసేందుకు ఆల యాధికారులు గుట్ట పైకి ప్రతి ఒక్క భక్తుడు, కారు, మోటరు సైకిళ్లు వెళ్లేందు కు వీలుగా ఘాట్ రోడ్డు నిర్మాణా నికి ప్రభు త్వానికి ప్రతిపాదనలు పంపారు. దీంతో ప్రభుత్వం ఆలాభివృద్ధికి కోసం నిధులు మంజూరు చేసేందుకు ముందుకు వచ్చింది. ఆలయంలో గుట్టుపైకి ఘాట్ రోడ్డు నిర్మాణానికి గత ప్రభుత్వం దేవాదాయ, ధర్మాదాయశాఖ నుంచి రూ.1.16 కోట్లు ఆలయ ముఖద్వారం నుంచి ప్రధాన రహదారి వరకు సీసీ రోడ్డు నిర్మాణానికి రూ.13 లక్షల నిధులు మంజూరు చేసింది. అప్పటి దేవాలయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యే రమేష్ బాబు 2021 డిసెంబర్ 19న అభివృద్ధి పనులు ప్రారం భించారు.

ఇందులో ముఖద్వారం నుంచి మొయిన్ రోడ్డు వరకు సీసీ రోడ్డు పనులు పూర్తి అయ్యాయి. ఘాట్ రోడ్డు పనులు మాత్రంమూడేళ్లుగా  కొనసాగు తూనే ఉన్నాయి. పనులు పూర్తి చేయాల్సి ఉండగా, ఆలయాధికారులు మాత్రం కాంట్రాక్టర్‌పై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. కేవలం నోటీస్లు ఇచ్చి చేతులు దులుపుకుంటు న్నారు. నిధులు ఉన్నప్పటికీ, పనులు చేయిం చడంలో అధికారులు ఎందుకు ఇంతా అలసత్వం వహించడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పనులు దక్కించుకున్న సదరు కాంట్రాక్టర్ ఈ ప్రాంతం కాకపోడం కూడా నిర్మాణం పనులు ముందుకు సాగడం లేదనే ఆరోప ణలు స్థానికులు చేస్తున్నారు. ఆలయానికి పురతాన చరిత్ర కలిగి ఉండడంతో భక్తుల కొంగుబంగారంగా నిలిస్తోంది. భక్తులు కోరిన కోర్కెలు తీర్చు తుందనే ప్రగాఢ విశ్వాసం ఉంది. పూర్వ కాలంలో ఈ ప్రాంతంలో మునులు తపస్సు చేసేవారు. దీంతో మహామునిపల్లెగా పిలుస్తుండగా, కాలక్రమేణ మామిడిపల్లిగా పేరుగాంచింది.

ఆలయంలోని పురాతన బావిలో కరువు ఉన్న సమయంలో సైతం నీరు పైకి ఉబికి వచ్చేది. ప్రతి మాఘ అమావాస్య సందర్భం గా కోనరావుపేటతో పాటు వేములవాడ, చందుర్తి, రుద్రంగి, కథలాపూర్, నిజామా బాద్ జిల్లా సిరికొండ, భీంగల్, మానాల గ్రామాల నుంచి అధిక సంఖ్యలో ఎండ్ల బండ్లపై వచ్చి, జాతరలో పాల్గొని మొక్కులు చెల్లించుకోని, ప్రత్యేక పూజలు చేస్తారు.

నిత్యం భక్తుల తాగిడికి ఉండగా, పలు అభివృద్ధి పనులు చేపట్టేం దుకు నిధులు మంజూరు చేసినప్పటికీ, ఆలయాధికారులు నిర్లక్ష్యంతోనే పనులు ఆలయంలో నత్త నడకన సాగుతున్నాయని భక్తులు, స్థాని కులు ఆరోపిస్తున్నారు. ఇప్పటి కైనా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆలయ ఘాట్ రోడ్డు నిర్మాణం పనులు శరవేగంగా సాగేలా చర్యలు తీసుకోవాలని భక్తులు, స్థానికులు కోరుతున్నారు.