- రైతు, కౌలు రైతు కష్టాలు తీరేనా
- ఎకరాకు రూ.7500ల కోసం రైతు ఎదురుచూపు
- అసెంబ్లీ సమావేశాలపై రైతుల ఆశలు
- యాసంగికి పంట సాయం అందేనా?
సిరిసిల్ల, డిసెంబర్ 21(విజయక్రాంతి): యాసంగి సీజన్లో పంటల సాగు కోసం పెట్టుడి సాయం కింద రైతు భరోసా లభించేనా అని రైతులు ఆశగా ప్రభుత్వం పైపు చూస్తు న్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఒక్కో సీజన్ కు పంటకు పెట్టు బడిగా రూ.7500లు యేడాదికి రూ.15 వేలు అందిసా మని హామీ ఇచ్చింది.
ప్రభుత్వ పాలన యేడాది కావడంతో ఈ యాసంగి సీజన్లో పంట పెట్టు బడి సాయం కింద రైతు భరోసా అందుతాయ, లేవా అనే ఆందోళనలో రైతులు ఉన్నారు. జిల్లాలోని 13 మండలాల్లో ఎక్కువగా వరి పంట సాగు పై రైతాంగం ఆధారపడి వ్యవసాయం చేస్తు న్నారు. ఈ యాసంగిలో 1.77 లక్షల ఎకరాలోల సాగు చేస్తారనే అధికారులు అంచనా వేశారు.
గత ప్రభుత్వం రైతు బంధు పథకం ద్వారా ఎకరాకు రూ.5 వేల చొప్పున, యేడాదికి రూ.10 వేలను 1.30 లక్ష మంది రైతు లకు రూ.250 కోట్లకు పైగా సాయం అందించింది. కానీ కొత్త ప్రభుత్వం మాత్రం యేడాదికి రూ.15 వేలు ఇస్తా మని హామీ ఇవ్వడంతో రైతులు సాయం కోసం ఎదురుచూస్తు న్నారు. అయితే సోమవారం నుంచి అసెంబ్లీలో నిర్వ హించనున్న సమావేశాల్లో రైతు భరోసా పై స్పష్టత వచ్చే ఆవకాశం మొండుగా ఉన్నాయని పలువురు అభిప్రాయ పడుతున్నారు.
అదేవిధంగా కౌలు రైతులకు గత ప్రభుత్వం పట్టించుకోలేదు. ప్రకతి వైపరీత్యానికి నష్ట పోయిన కౌలు రైతులకు ఎలాంటి సాయం అందించకపోవడంతో తీవ్రంగా నష్ట పోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కౌలు రైతుల కష్టాలు తీర్చుతామని ఎన్నికల్లో వాగ్ధా నాలు చేశారు. ఈ సారైనా తమ కష్టాలు గట్టెక్కేనా అనే ఆశతో ఉన్నారు.
జిల్లా లోదాదాపు 80 వేల వరకు కౌలు రైతులు ఉన్నట్లు అధికారులు చెబుతు న్నారు. భూగర్భ జలాల పెరుగుదల ఎక్కువగా ఉండడం, కౌలు ధరలు సైతం ఎక్కువగా కావడంతో కౌలు ఇచ్చేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ఎకరాకు రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు ఉండడంతో ఈ సారి రైతు భరోసా లభిస్తుందా అనే ఆశల పల్లకిలో ఉన్నారు. ప్రభుత్వం రైతుల కష్టాలను గట్టె క్కించేందుకు ఈ సమావేశాల్లో నిర్ణ యాలు తీసుకోవాలని కోరుతున్నారు.