- నిర్మల్ జిల్లాలోని బల్దియాల్లో పేరుకపోయిన పన్నులు
- ప్రత్యేక అధికారులైనా వసూలు చేసేనా..
- గడువు సమీపిస్తుండటంతో స్పీడు పెంచిన అధికారులు
నిర్మల్, జనవరి 30(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో మొండి బకాయిలు వసూలు కావడం లేదు. ఆయా ప్రభుత్వ కార్యాలయాల నుంచి దా దాపు రూ 3.57 కోట్ల రూపాయలు రావా ఉంది. మార్చి 31తో ఈ ఆర్థిక సంవవత్సరం ముగియనున్న నేపత్యంలో మొండి బకాయిల వసూళ్లపై మున్సిపల్, రెవిన్యూ శాఖ దృష్టి సారించింది.
ఇన్నాళ్లు మున్సిపాలిటీల్లో ప్రజాప్రతినిధుల పాలన ఉండటం ఆస్తి పన్నుల వసూళ్లపై అంతంత మాత్రంగానే చర్యలు తీసుకున్న అధికారులు పాలకవర్గ పదవీకాలం ముగియడంతో.. ఒత్తిళ్లు ఉండవని భావించి పన్నుల వసూళ్లపై ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
నిర్మల్ జిల్లాలో నిర్మల్, భైంసా, ఖానాపూర్ మున్సిపాలిటీలున్నాయి. ఇటీవల గ్రూప్ పరీక్షలో ప్రతిభ చూపి 28 మంది వార్డు ఆఫీసర్లుగా ఎంపికయ్యారు. వీరి తమకు కేటాయించిన వార్డుల్లో ప్రతిరోజూ పర్యటిస్తూ పన్నులు రాబట్టేలా చర్యలు చేపడుతున్నారు.
మార్చి నెలతో ఈ ఆర్థిక సంవత్సరం పూర్తికానున్న నేపథ్యంలో వసూళ్లపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని అడిషనల్ కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ మున్సిపల్ కమిషనర్లు, వార్డు అధికారులను ఆదేశించారు.
రూ.3.57 కోట్ల బకాయిలు
నిర్మల్ జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాల బకాయిలు రూ 3.57 కోట్లు ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఇందులో రెవెన్యూ కార్యాలయాల నుంచి రూ.26.66 లక్షలు, సహకార శాఖ రూ.36.07 లక్షలు, ఎంపీడీవో కార్యాలయాలు రూ.23.24 లక్షలు ఇలా విద్యుత్, రహదారులు, పంచాయతీ, గ్రంథాలయం, వ్యవసాయం, మార్కెటింగ్, పశు సంవర్ధక శాఖ తదితర ప్రభుత్వ శాఖల నుంచి పెండింగ్ బకాయిలు రావాల్సి ఉంది. ఇప్పటి వరకు 3.74 లక్షలు మాత్రమే వసూల్ చేశారు.
పన్నులు చెల్లించాలి
మున్సిపాలిటీల్లో ప్రజలు, ప్రభుత్వ కార్యాలయాలకు సంబం పన్నుల వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించాం. జిల్లాలో మొత్తం రూ.6 కోట్ల పెండింగ్ డబ్బులు రావాల్సి ఉండగా, అందులో ప్రభుత్వకార్యాలయాల పన్నులే రూ.3.57 కోట్లు ఉన్నాయి. ప్రభుత్వ కార్యాలయాలకు మౌఖికంగా ఆదేశాలిచ్చాం. ప్రతీ వారం సమీక్ష నిర్వహించి టార్గెట్ పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటాం.
ఫైజాన్ అహ్మద్,
అదనపు కలెక్టర్, నిర్మల్